అదీ నిజం కాదు.. ఇదీ నిజం కాదు..!!

మెగా ఫ్యామిలి లో లుకలుకలు. అన్న చిరు కి తమ్ముడు పవన్ కి పడదు. అల్లు అరవింద్ – చిరు కి మధ్యన విభేదాలు ఇలా చాలా [more]

Update: 2020-04-11 04:47 GMT
.ugb-f4adde4-wrapper.ugb-container__wrapper{padding-top:0 !important;padding-bottom:0 !important;background-color:#8ed1fc !important}.ugb-f4adde4-wrapper > .ugb-container__side{padding-top:35px !important;padding-bottom:35px !important}.ugb-f4adde4-wrapper.ugb-container__wrapper:before{background-color:#8ed1fc !important}.ugb-f4adde4-content-wrapper > h1,.ugb-f4adde4-content-wrapper > h2,.ugb-f4adde4-content-wrapper >
h3,.ugb-f4adde4-content-wrapper > h4,.ugb-f4adde4-content-wrapper > h5,.ugb-f4adde4-content-wrapper > h6{color:#222222}.ugb-f4adde4-content-wrapper > p,.ugb-f4adde4-content-wrapper > ol li,.ugb-f4adde4-content-wrapper > ul li{color:#222222}
  • నా బావ మరిది నాకు మధ్య గొడవలా..!?
  • నా తమ్ముడు నేను వేరు కాదు.
  • ఇవన్నీ ఉత్త పుకార్లు.
  • చిరంజీవి స్పష్టీకరణ…

మెగా ఫ్యామిలి లో లుకలుకలు. అన్న చిరు కి తమ్ముడు పవన్ కి పడదు. అల్లు అరవింద్ – చిరు కి మధ్యన విభేదాలు ఇలా చాలా వార్తలు మీడియాలో నానుతూనే ఉంటాయి. అల్లు అర్జున్ వేరు కుంపటి. చిరు అల్లు ఫ్యామిలీ కి పడడం లేదు.. చిరు మాట వినని అల్లు ఫ్యామిలీ, అల్లు అరవింద్ ని తప్పించి నిర్మాతగా ఎదుగుతున్న రామ్ చరణ్, చిరు మాట లెక్క చెయ్యని అల్లు అర్జున్ అబ్బో ఇలాంటి న్యూస్ లు సోషల్ మీడియాలో జోరు జోరుగా ప్రచారం అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి న్యూస్ ల పై తాజాగా మెగాస్టార్ చిరు స్పందించాడు.

అల్లు అరవింద్ నా బావమరిది, నా కుటుంబ సభ్యుడు. అరవింద నేను ఒకరి సలహాలు ఒకరం తీసుకుంటాం. ఇంట్లో బయట ముఖ్యమైన విషయాలను కలిసి చర్చించుకుంటాము. మా మధ్యన గొడవల లాంటివేం లేవు. మా మధ్యన విభేదాలు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అంతేకాదు.. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి నాకు మధ్యన కూడా గొడవలు, విభేదాలనంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు ఇలాంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారు, ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో అర్ధం కాదు.. అసలు ఇలాంటి పుకార్లను, ఇలాంటి న్యూస్ లను నేను పట్టించుకోను. సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయం మట్లాడుతున్న అంటూ పవన్ విషయము, అరవింద్ విషయము రెండిటికి క్లారిటీ ఇచ్చేసాడు. 

Tags:    

Similar News