ఆమె’ హిందీ లో రీమేక్ కాబోతుంది

తమిళంలో రూపొందిన ‘ఆడై’ చిత్రంలో అమలాపాల్ సౌత్ లో ఎవరు చేయని విధంగా బోల్డ్ గా నటించింది. ఈ మూవీలో ఆమె ఒక గంట పాటు న్యూడ్‌గా [more]

Update: 2019-10-23 07:58 GMT

తమిళంలో రూపొందిన ‘ఆడై’ చిత్రంలో అమలాపాల్ సౌత్ లో ఎవరు చేయని విధంగా బోల్డ్ గా నటించింది. ఈ మూవీలో ఆమె ఒక గంట పాటు న్యూడ్‌గా క‌నిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరు తో రిలీజ్ అయినా ఈ సినిమాలో అమలా ను పూర్తి న‌గ్నంగా చూపించ‌కుండా క‌వ‌ర్ చేసిన‌ప్ప‌టికీ.. న‌గ్నంగా ఉన్న భావ‌న ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంది. కాకపోతే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాకపోతే ఒక సౌత్ హీరోయిన్ ఇటువంటి పాత్ర చేయడం సంచ‌న‌ల‌మే. అయితే ఇప్పుడు ఈ మూవీ సరైన చోటుకి వెళ్లనుంది.

కంగనా విన్నదా…..?

హిందీలో ఈ మూవీ రీమేక్ కానుంది. హిందీ లో ఇటువంటి చిత్రాలకు పెట్టింది పేరు. అక్కడ థ్రిల్ల‌ర్లు, రొమాంటిక్ చాలా వచ్చాయి. ఇటువంటి పాత్రలో చేయడానికి చాలామంది హీరోయిన్స్ అక్కడ రెడీగా ఉంటారు. కాకపోతే హిందీ లో ఈ చిత్రం రీమేక్ అనగానే కంగ‌నా ర‌నౌత్‌ చేస్తుందని భావిస్తున్నారు. పైగా ఇందులో ఫెర్ఫామెన్స్ కూడా ఉంది కాబట్టి కంగనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చాలామంది. ఇక ఈ మూవీ రీమేక్ రైట్స్ విక్ర‌మ్ భ‌ట్ సొంతం చేసుకున్నారు. మరి ఈ మ్యాటర్ కంగనా వరకు వెళ్లిందా? లేదా? అనేది తెలియాల్సిఉంది.

 

Tags:    

Similar News