The Kerala Story: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న వివాదాస్పద సినిమా
ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన కేరళ స్టోరీ సినిమా ఎట్టకేలకు OTTకి
The Kerala Story: ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన కేరళ స్టోరీ సినిమా ఎట్టకేలకు OTTకి చేరుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన, కేరళ స్టోరీ సినిమా గత ఏడాది మేలో థియేటర్లలో విడుదలైంది. భారతదేశంలో దాదాపు 250 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఈ సినిమా తీశారంటూ పలు వివాదాలను కూడా ఎదుర్కొంది. అయితే కేరళ స్టోరీ సినిమా ఎట్టకేలకు OTTకి చేరుకుంది.
సినిమా డిజిటల్ హక్కులను ZEE5 కొనుగోలు చేసింది. 23 జూన్ 2023 న ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేయాల్సి ఉంది. పలు కారణాల వల్ల స్ట్రీమింగ్ జరగలేదు. తాజాగా ఈ చిత్రం A సర్టిఫికేట్ నుండి U/A రీసెన్సార్ ను పొందిందని.. కొన్ని సీన్లను ట్రిమ్ చేశారని తెలుస్తోంది. ఓటీటీ డెబ్యూకి సంబంధించి చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. ది కేరళ స్టోరీ సినిమాలో ఈ నెలలోనే ZEE5 లో ప్రసారం చేయాలని భావిస్తున్నారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ నటించిన ది కేరళ స్టోరీ ఊహించని సక్సెస్ ను అందుకుంది. 32,000 మంది కంటే ఎక్కువ మంది కేరళ మహిళలని ఇస్లామిక్ ఛాందసవాదులు తీవ్రవాదులుగా మార్చారని ఈ మూవీ మేకర్స్ తెలిపారు.