'ది లెజెండ్' సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ
లెజెండ్ శరవణన్ అరుల్ 'ది లెజెండ్' సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ
కొన్ని సంవత్సరాల నుండి లెజెండ్ శరవణన్ తన లెజెండ్ శరవణ స్టోర్స్ కోసం వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలను అందుకున్న శరవణన్.. సినిమా రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి తన స్వంత డబ్బులతో చిత్రాన్ని నిర్మించి.. భారీ బడ్జెట్ సినిమా చేశాడు. చాలా కాలంగా మరచిపోయిన దర్శక ద్వయం JD-జెర్రీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకులుగా మారారు. ట్రైలర్, పాటలు ఎంతో రిచ్ నెస్ తో కూడుకున్నవిగా ఉన్నాయి. ఈరోజు సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా పైరసీ బారిన పడింది.
'ది లెజెండ్' చిత్రంతో నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. ఒక కొత్త నటుడికి మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో విడుదల అయింది. లెజెండ్ శరవణన్ భారీ స్థాయిలో థియేటర్లలో అడుగుపెట్టాడు. 'ది లెజెండ్' ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో విడుదల అయింది. అయితే ఈ సినిమా పైరసీకి గురైంది. ఆన్‌లైన్‌లో movierulz, tamilrockers, Tamilmv, filmyzilla వంటి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్‌సైట్‌లలో, వ్యక్తులు సాధారణంగా మొదటి రోజు థియేటర్‌ల నుండి వీడియోను రికార్డ్ చేసి వీక్షకుల కోసం ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తారు. పరిశ్రమకు చెందిన వ్యక్తులు, సైబర్ అధికారులు పైరసీని నివారించడానికి తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ ఎన్నో సినిమాలు మొదటి రోజునే పైరసీ బారిన పడుతూ ఉన్నాయి.