పవన్ పేరుతొ టైటిల్ అనుకుంటే…!!

పవన్ కళ్యాణ్ – దిల్ రాజు – వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా కరోనా అడ్డంకితో విడుదల వాయిదా పడింది. లేదంటే పవన్ [more]

Update: 2020-05-28 06:05 GMT

పవన్ కళ్యాణ్ – దిల్ రాజు – వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా కరోనా అడ్డంకితో విడుదల వాయిదా పడింది. లేదంటే పవన్ ఫాన్స్ ఈపాటికి థియేటర్స్ దగ్గర దుమ్మురేపేవారే. అయితే వకీల్ సాబ్ సినిమా ని పవన్ కళ్యాణ్ అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు. త్రివిక్రమ్ చెప్పాడు.. పింక్ సినిమా చూడమని. పవన్ చూసి సినిమా రీమేక్ ఒప్పుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కి పింక్ రీమేక్ సూట్ అవదేమో అనుకున్నారు. కానీ పవన్ లుక్ మ్యానరిజం అన్ని ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ ప్రముఖ సినిమా వ్యక్తి పవన్ కి ఎలాంటి టైటిల్ పెడతారో అని తెగ ఆత్రంగా ఎదురు చూసాడంట. ఆయనెవరో కాదు ప్రముఖ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చేస్తున్నాడు ఓకె.. ఈ సినిమాకి బాలీవుడ్ లో అమితాబ్ హీరోగా పింక్ అనే టైటిల్ పెట్టారు. అలాగే తమిళనాట అజిత్ హీరోగా నీరుకొండ పర్వాయ్ అనే టైటిల్ పెట్టారు. మరి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఇంట్రెస్ట్ కలిగింది. పవన్ కళ్యాణ్ అందగాడు. పవన్ చేసిన సూపర్ హిట్ మూవీస్ లో జల్సా కానీ, అత్తారింటికి దారేది లో కానీ పవన్ పేరు ఎక్కడా వాడలేదు. మరి ఈ పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కి సంబందించిన కేరెక్టర్ పేరు ఏమన్నా వాడతారమేమో అనుకున్నా. లైక్.. లాయర్ విశ్వనాధం, లాయర్ భారతి దేవి ఇలా పాత కాలపు టైటిల్స్ ఎమన్నా పెడతారేమో అనుకున్నా. కానీ ఇంట్రెస్టింగ్ గా వకీల్ సాబ్ అంటూ పెట్టేసరికి అబ్బ ఎంత బావుందో అంటూ.. ఈ టైటిల్ ఆలోచన చేసినవారికి హ్యాట్సాఫ్ అంటున్నాడు పరచూరి గోపాలకృష్ణ.

Tags:    

Similar News