టాలీవుడ్ లో విషాదం.. నటుడి మృతి
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి చెందారు
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ నిన్న శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో మృతి చెందారు. శ్రీనివాస్ దాదాపు నలభై సినిమాలకు పైగా నటించారు. టీవీ సీనియళ్లలో నటించి అందరికీ సుపరిచితుడయ్యాడు.
గుండె సంబంధిత వ్యాధితో...
షూటింగ్ సమయంలో గాయం కావడంతో ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమ కావాలి, నచ్చావులే వంటి హిట్ సినిమాల్లో శ్రీనివాస్ నటించాడు. శ్రీనివాస్ మృతి పట్ల టాలీవుడ్ లో పలువురు సంతాపాన్ని ప్రకటించారు.