వాళ్ళు ఓటిటి అంటే కుదరదంటున్నారు!!

థియేటర్స్ మూత బడిన తర్వాత అన్ని భాషల చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఓటిటి లకు అమ్మేసుకుంటున్నారు. పెద్ద సినిమాలు, మీడియం సినిమాల విషయంలో ఓటిటీల లెక్కలు [more]

Update: 2020-08-24 09:24 GMT

థియేటర్స్ మూత బడిన తర్వాత అన్ని భాషల చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఓటిటి లకు అమ్మేసుకుంటున్నారు. పెద్ద సినిమాలు, మీడియం సినిమాల విషయంలో ఓటిటీల లెక్కలు సరిపోలేదు. కానీ చివరికి థియేటర్స్ ఓపెన్ అయినా చాలా పరిమితులు ఉన్నాయి కాబట్టి..  నాని – దిల్ రాజులు వంటి వారు ఎలాగో ఓటిటి వాళ్లకి చిక్కారా.. లేదంటే నాని వాళ్ళ వలలో ఓటిటి వాళ్లే పడ్డారో కానీ.. మొత్తని వి సినిమా అమెజాన్ ప్రైమ్ కి ఎక్కింది. ఇక మనకన్నా ముందు బాలీవుడ్ లో చాలామంది పెద్ద హీరోలే ఓటిటికి జెండా ఊపారు. అందులో గులాబో సితాబో, దిబ్ బేచారా, శకుంతలా దేవి లాంటి పెద్ద సినిమాలు డైరెక్ట్ ఓటిటీలలోనే విడుదలయ్యాయి, అవుతున్నాయి. అక్కడ పెద్ద హీరోలే ఓటిటి అంటే.. ఇంకొందరు మాత్రం ఓటిటికి తమ సినిమాలు ఇవ్వమంటున్నారు. మా సినిమాలు థియేటర్స్ లోనే విడుదల కావాలంటున్నారు.

అందులో రణ్వీర్ సింగ్ నటించిన కపిల్ దేవ్ బయోపిక్ 83 కి ఎన్ని ఓటిటి ఆఫర్స్ వచ్చినా రణ్వీర్ మాత్రం టెంప్ట్ అవడం లేదు. మరోపక్క అక్షయ్ కుమార్ సూర్యవంశీ మేకర్స్ కూడా తమ సినిమా ఓటిటిలో విడుదల చెయ్యమన్నారు. థియేటర్స్ పరిస్థితి త్వరలోనే చక్కబడితే తమ సినిమాలను ఓటిటీలలోనే విడుదల చేస్తామంటున్నారు. దసరా టైం కి కాకపోయినా.. దీపావళి, క్రిష్ట్మస్ టైం కి థియేటర్స్ ఓకె అయినా చాలంటున్నారు. మరి కొంతమంది పెద్ద హీరోలు ఓటైటిలకు టెంప్ట్ అయినా.. కొంతమంది మాత్రం ఓటైటిస్ కి ఇష్టపడడం లేదు. మరి థియేటర్స్ పరిస్థితి మెరుగవకపోతే చివరికి వాళ్ళు కూడా ఓటిటీస్ దిక్కవుతాయి.

Tags:    

Similar News