నాగబాబు జబర్దస్త్ జర్నీ ముగిసింది

జబర్దస్త్ నుండి నాగబాబు అధికారికంగా బయటికెళ్ళిపోతున్నట్టుగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు నాగబాబు. [more]

Update: 2019-11-22 06:23 GMT

జబర్దస్త్ నుండి నాగబాబు అధికారికంగా బయటికెళ్ళిపోతున్నట్టుగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు నాగబాబు. నిన్నమొన్నటివరకు మీడియాలో, ఛానల్స్ లో నాగబాబు జబర్దస్త్ ని వీడుతున్నాడని అన్నారు గాని నాగబాబు స్వతహాగా ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఈ శుక్రవారం తర్వాత తాను జేడ్జ్ గా ఇక కనబడనని జబర్దస్త్ సందేహాలకు ఓ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. 2013 నుండి 2019 వరకు తన జబర్దస్త్ జర్నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది అని చెప్పిన నాగబాబు…

నన్ను ఆర్థికంగా జబర్దస్త్ షో ఆదుకుందని చెప్పడమే కాదు.. తాను జబర్దస్త్ వలన లాభపడ్డా అని, తన వలన జబర్దస్త్ షోకి మంచే జరిగిందని, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు నన్ను ఆర్ధికంగా ఆదుకున్నప్పటికీ, నా రేంజ్ పారితోషకం అయితే ఇవ్వలేదని, అసలు ఇన్నేళ్ల నా జర్నీలో నాకు నేను గా జబర్దస్త్ నుండి తప్పుకుంటా అని అనుకోలేదని, కానీ నేను పారితోషకం వల్లనే జబర్దస్త్ నుండి తప్పుకుంటున్న అని వస్తున్న వార్తల్లో నిజం లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇన్నాళ్లుగా నాకు ఈ అవకాశాలు ఇచ్చిన శ్యాం ప్రసాద్ రెడ్డిగారికి ధన్యవాదాలు చెబుతున్నా అని చెప్పిన నాగబాబు అసలెందుకు షో నుండి తప్పుకోవాల్సి వచ్చిందో త్వరలోనే ఫుల్ క్లారిటీ ఇస్తా అని చెబుతున్నాడు

Tags:    

Similar News