విడాకుల వార్తలపై స్పందించిన శ్రీకాంత్

ఇప్పుడేమో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము విడాకులు తీసుకుంటున్నామని కొత్త పుకారు పుట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-11-22 10:45 GMT

srikanth divorce with Ooha

ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, ఆయన భార్య ఊహ విడాకులు తీసుకుంటున్నారంటూ రెండ్రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాము విడాకులు తీసుకుంటున్నామంటూ వచ్చిన వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనికిమాలిన వార్తల్ని ఎవరు పుట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో కూడా తాను చనిపోయినట్టుగా పుకారు పుట్టించారని.. ఆ వార్త చూసి తన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నారు.

ఇప్పుడేమో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము విడాకులు తీసుకుంటున్నామని కొత్త పుకారు పుట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను ఊహకు తన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేశారని.. ఆమె కంగారు పడుతూ ఆ పోస్టులను తనకు చూపించిందని చెప్పారు. ఇలాంటివి చూసి ఆందోళన చెందొద్దని ఊహను తాను ఓదార్చినట్లు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు శ్రీకాంత్. ప్రస్తుతం తామిద్దరం దైవదర్శనం కోసం అరుణాచలంకు వెళ్తున్నామని ఇలాంటి తరుణంలో ఇలాంటి తప్పుడు వార్తలు తమ కుటుంబానికి చాలా చికాకును తెప్పిస్తున్నాయని శ్రీకాంత్ ఫైరయ్యారు. కొన్ని వెబ్ సైట్లకు, యూట్యూబ్ ఛానళ్లకు తమలాంటి సెలబ్రిటీలపై పుకార్లు చేస్తూ.. పర్సనల్ లైఫ్ ను డిస్టర్బ్ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు శ్రీకాంత్.


Tags:    

Similar News