అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి పూనమ్ కౌర్.. లక్షణాలివే..
యమలీల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ‘మాయాజాలం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది పూనమ్ కౌర్. ఆ తర్వాత పలు చిత్రాల్లో..
ఒకప్పుడు తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగి అదృశ్యమైన నటి పూనమ్ కౌర్.. తాజాగా అరుదైన వ్యాధి బారిన పడ్డారంటూ వార్తల్లో నిలిచారు. ఇటీవల సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూనమ్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, అందుకు ఆమె కేరళలో చికిత్స పొందుతోందంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన నటి, హీరోయిన్ పూనమ్ కౌర్.. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారు.
వ్యాధి లక్షణాలు
ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి అరుదైన అనారోగ్య సమస్య. అలసట, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. పూనమ్ రెండేళ్లుగా ఈ జబ్బుతో బాధపడుతోంది. ప్రస్తుతం కేరళలో ఆమెకు వ్యాయామాలు, టాకింగ్ థెరపీ, తో పాటు ఆయుర్వేద మందులతో చికిత్స చేస్తున్నారు.
కాగా.. యమలీల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 'మాయాజాలం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది పూనమ్ కౌర్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఎప్పుడూ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కేరళలో ట్రీట్‌మెంట్ కంటే ముందే పలు ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో.. ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లిందని తెలుస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ ఆమె చేయి పట్టుకోవడంపై పెద్ద వివాదమే చెలరేగగా.. తాను పడిపోతుండగా ఆయన పట్టుకున్నారని, దీనిపై రచ్చ చేయడం తగదని ఫైర్ అయింది పూనమ్.