సీఎం కేసీఆర్ బయోపిక్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు !

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. దాని పరిణామం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుండటంతో వర్మ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడా;

Update: 2022-03-31 12:11 GMT

న్యూ ఢిల్లీ : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల వర్మ తీస్తున్న సినిమాలన్నీ ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. తాజాగా వర్మ తీసిన డేంజరస్ అనే సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో అప్సరా రాణి, నైనా గంగూలి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. దాని పరిణామం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుండటంతో వర్మ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడా అనే ఆతృత అందరిలోనూ నెలకొంది.

ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ ను చిత్రయూనిట్ ఢిల్లీలో విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమాజంలో ఇద్దరు అమ్మాయిలు మధ్య ప్రేమ పుడితే అది ఎలా ఉంటుందన్న కోణంలో సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తారా అని మీడియా అడగగా.. ఖచ్చితంగా తీస్తానని.. కానీ దానికి ఇంకా సమయం పడుతుందని వర్మ తెలిపారు. బయోపిక్ చిత్రాలు ఊరికే రావని.. వాటి వెనకాల చాలా రీసెర్చ్, కృషి ఉంటుందని ఆయన అన్నారు.


Tags:    

Similar News