Ileana : తన బిడ్డకి తండ్రి అతనే అంటూ ఇలియానా పోస్ట్..
ఇన్నాళ్లకు తన భర్త ఎవరు, తన బిడ్డకి తండ్రి ఎవరు అనే దాని పై మౌనం పాటించిన ఇలియానా ఎట్టకేలకు అతను ఎవరో తెలియజేసింది.
Ileana D’Cruz : గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ఎంట్రీతోనే స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. సౌత్ లో స్టార్ స్టేటస్ ని అందుకున్న ఈ భామ.. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అనుకోని బోల్తా పడ్డారు. అక్కడ ఇలియానా నటించిన సినిమాలు పెద్ద విజయం సాదించకపోవడంతో అవకాశాలు లేకుండా పోయాయి. ప్రొఫిషనల్ లైఫ్ ఇలా ఉంటే, పర్సనల్ లైఫ్ లో పెళ్లి విషయం చెప్పకుండానే ప్రెగ్నెన్సీ గురించి చెప్పి షాక్ ఇచ్చారు.
ఈ సంవత్సరం మే నెలలో ఇలియానా తన ప్రెగ్నెన్సీ గురించి తెలియజేస్తూ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఇలియానా ఎప్పుడు ఎవర్ని పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఆమధ్య ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ‘డేట్ నైట్’ అంటూ రాసుకొచ్చారు. అయితే అతనే తన భర్త అనే దాని పై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇలియానా తన భర్త ఎవరు అన్నది తెలియజేశారు.
ఇలియానా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో ఒక అభిమాని.. "సింగల్ పేరెంటింగ్ ఎలా అనిపిస్తుంది?" అంటూ క్యూస్షన్ చేశాడు. దీనికి ఆమె బదులిస్తూ.. "నేను సింగల్ పేరెంట్ ని ఏమీ కాదు" అని చెబుతూ తన భర్త, తన బాబుకి తండ్రి అయిన వ్యక్తి ఫోటోని షేర్ చేశారు. గతంలో డేట్ నైట్ అంటూ పరిచయం చేసిన వ్యక్తే తన భర్తని ఇలియానా ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చేశారు.
అయితే నెటిజెన్స్ లో ఇప్పుడు మరో సందేహం మొదలైంది. ఆ వ్యక్తి ఎవరు..? ఏం చేస్తాడు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇంటరాక్షన్ లోనే మరో నెటిజెన్ ఇలియానాను సినిమాల్లో రీ ఎంట్రీ గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. "ప్రస్తుతం అమ్మగా తన భాద్యత నిర్వర్తిస్తున్నాను. కానీ సాధ్యమైనంత త్వరగా మళ్ళీ సినిమాలోకి తిరిగి వస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.