Samantha : కొత్త పనితో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సమంత..
ఆరోగ్యం పై దృష్టి పెట్టి ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సమంత.. కొత్త పనితో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.;
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం.. ఆరోగ్యం పై దృష్టి పెట్టి సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రెస్ట్‌తో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 'మయోసైటిస్' వంటి అరుదైన రోగంతో బాధ పడుతున్న సమంత.. చికిత్స తీసుకుంటూనే, ఆ రోగంతో బాధ పడుతున్న వారికి ధైర్యం చెప్పేలే, మయోసైటిస్ పై అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతుంటుంటారు. అంతేకాదు, ఇండియాలో మయోసైటిస్ కి అంబాసడర్ గా పని చేస్తున్నారు. ఇప్పుడు మరో పని కూడా చేసేందుకు సమంత సిద్ధమయ్యారు.
తన కొత్త పని గురించి సమంత తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ.. "నేను మళ్ళీ పని చేయడం మొదలుపెట్టబోతున్నాను. ఎవరు ఊహించని విధంగా నేను ఒక హెల్త్ పాడ్‌కాస్ట్‌ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇది నేను ఎంతో ఇష్టంతో చేయబోతున్న పని. నెక్స్ట్ వీక్ నుంచి ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ పాడ్‌కాస్ట్ మీలో చాలామందికి ఉపయోగపడతాయి" అంటూ సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అనారోగ్యంతో బాధ పడుతున్న వారికీ సరైన అవగాహన కల్పించేలా సమంత తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఇక సమంత అభిమానులు విషయానికి వస్తే.. ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. సామ్ నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక మరో పక్క ఓ నిర్మాణ సంస్థని కూడా సమంత మొదలుపెట్టింది. అలాగే త్వరలోనే ఆరోగ్యం నుంచి పూర్తిగా కోలుకొని, యాక్టింగ్ కెరీర్ ని కూడా రీ స్టార్ట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.