ఆ నిర్మాత కుటుంబంలో ఊహించని విషాదం
ఈ విషయం తెలిసి జనసేనాని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు
'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మరణించారు. ఎస్కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జనసేనాని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. నిర్మాత గాదె శ్రీనివాస కుమార్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు కన్నుమూశారని తెలిసి చింతించానని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఎస్కేఎన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలువురు సినీ ప్రముఖులు ఎస్‌కేఎన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. జనవరి 4 సాయంత్రం 4 గంటలకు ఫిలిమ్‌నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
ఎస్‌కేఎన్ డిస్ట్రిబ్యూటర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అల్లు అరవింద్ కుటుంబంతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం అతన్ని నిర్మాతను చేసింది. దీంతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గతేడాది తన స్నేహితుడు డైరెక్టర్ సాయి రాజేష్‌తో కలిసి బేబీ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’, సుహాస్ ‘కలర్ ఫోటో’, సాయి ధరమ్ తేజ్ ‘ప్రతి రోజూ పండగే’, ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమాలను ఎస్‌కేన్ నిర్మించారు.