టాలీవుడ్ లో కరోనా కలకలం.. రాజేంద్ర ప్రసాద్ కు పాజిటివ్ !
టాలీవుడ్ ను కరోనా వెంటాడుతోంది. ప్రముఖ సెలబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర
టాలీవుడ్ ను కరోనా వెంటాడుతోంది. ప్రముఖ సెలబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. స్వల్ప లక్షణాలతోనే ఆయన కోవిడ్ బారిన పడ్డారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు.
అలాగే హీరోయిన్ త్రిషకు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ.. కోవిడ్ తనను వదల్లేదంటూ త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఈ వారంరోజుల్లో మంచులక్ష్మి, మహేష్ బాబు, ఎస్ ఎస్ తమన్, మీనా, హీరో నితిన్ భార్య షాలిని లు కోవిడ్ బారిన పడ్డారు. అటు బాలీవుడ్ లో హీరో అర్జున్ కపూర్ కుటుంబమంతా కోవిడ్ లో చిక్కుకున్నారు. వీరంతా హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.