క్యాన్సర్ తో టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కన్నుమూత !
తెలుగు చిత్ర పరిశ్రమకు శరత్ ఎన్నో హిట్ సినిమాలు అందించారు. చాదస్తపు మొగుడు సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.;
హైదరాబాద్ : టాలీవుడ్ లో మరో విషాద ఘటన జరిగింది. ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కుమార్ క్యాన్సర్ తో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. హైదరాబాద్ లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శరత్ కుమార్ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు శరత్ కుమార్ మృతిపట్ల నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు శరత్ ఎన్నో హిట్ సినిమాలు అందించారు. చాదస్తపు మొగుడు సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సుమన్ , భానుప్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చాదస్తపు మొగుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన శరత్ దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో సుమన్, బాలకృష్ణలతో చేసిన సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. బాలక్రిష్ణతో వంశానికి ఒక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్దరకుడు వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. సుమన్ తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది,చిన్నల్లుడు వంటి సినిమాలు తెరకెక్కించారు.