సీనియర్ హీరోల దారెటు!

కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాలను వణికిస్తుంది. దేశం లో లాక్ డౌన్ పెట్టె పరిస్థితులు తేవొద్దు అంటూ పీఎం మోడీ వార్నింగ్ ఇస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ [more]

Update: 2021-04-23 05:59 GMT

కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాలను వణికిస్తుంది. దేశం లో లాక్ డౌన్ పెట్టె పరిస్థితులు తేవొద్దు అంటూ పీఎం మోడీ వార్నింగ్ ఇస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూస్ పెట్టేసుకుంటున్నాయి. తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో ఇక్కడ థియేటర్స్ మూతబడ్డాయి. అసలు థియేటర్స్ సామర్ధ్యం 50 పర్సెంట్ తగ్గగానే చాలామంది దర్శకనిర్మాతలు, హీరోలు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసేసారు. నాగ చైతన్య, నాని, రానా ముందుగా తమ సినిమాలను పోస్ట్ పోన్ చెయ్యగా నిన్నటినుండి థియేటర్స్ మూతబడడంతో ఇష్క్, అనసూయ థాంక్యూ బ్రదర్, ఏక్ మినీ ప్రేమ కథలు పోస్ట్ పోన్ అనివార్యం అయ్యాయి. ఇక మే నెలలో విడుదల కావాల్సిన సినిమాల పరిస్థితి ఏమిటి.  
మే 1 వరకు నైట్ కర్ఫ్యూ అంటూ తెలంగాణ స్టేట్ ప్రకటించింది. మే ఫస్ట్ తర్వాత ఏం జరగబోతుంది. చాలామంది హీరోలు మే నెలలో విడుదల చెయ్యాల్సిన సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మే లో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు చిరు ఆచార్య, వెంకీ నారప్ప, బాలయ్య అఖండ, రవితేజ ఖిలాడీ.. ఈ సినిమాల పరిస్థితి ఏమిటి? సినిమాలు వాయిదా పడతాయా? అసలు అఫీషియల్ ప్రకటన ఏది? ఇప్పుడు సీనియర్ హీరోల ఫాన్స్ లో మెదులుతున్న ప్రశ్నలు. ఈ నాలుగు సినిమాల షూటింగ్స్ లో కొవిడ్ కారణంగా అటు ఆచార్య, ఇటు రవితేజ ఖిలాడీ షూటింగ్స్ కి బ్రేకులు పడ్డాయి. నారప్ప షూటింగ్ ఎప్పుడో ఫినిష్.  
ఇక బాలయ్య అఖండ షూటింగ్ ఇంకా జరుగుతుంది. మరి ఈ హీరోలు ఏం చేస్తారు? సినిమాలు పోస్ట్ పోన్ చేస్తారా? చెయ్యరా? అనేక రకాల ప్రశ్నల్తో ఫాన్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కరోనా ఉధృతి తగ్గి థియేటర్స్ సామర్ధ్యం పెరిగితే తప్ప సినిమాలు లు రిలీజ్ లు కావు.

Tags:    

Similar News