టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోలలో బెస్ట్ డాన్సర్స్ ఎవరంటే వెంటనే అంతా అల్లు అర్జున్ పేరు ముందు చెపుతాం. అల్లు అర్జున్ సినిమాల్లో డాన్స్ చాలా అట్ట్రాక్టీవ్ గా ఉంటాయి. అతను వేసే స్టెప్స్ కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ లో చాలామంది సెలెబ్రెటీస్ అల్లు అర్జున్ మంచి డాన్సర్ అని కితాబు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. బన్నీకి అభిమానగణం ఇంతగా పెరగడానికి కారణం.. అతని డాన్సులు కూడా. ఈ నేపధ్యంలో నిన్న జరిగిన 'పడి పడి లేచి మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ..."సాయి పల్లవి డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని...'ఫిదా' సినిమాలో 'వచ్చిండే… మెళ్లా మెళ్లగ వచ్చిండే' సాంగ్ లో సాయి పల్లవి డాన్స్ చాలా బాగా చేసింది.. ఈ సాంగ్ ను సాయి పల్లవి ఎన్నిసార్లు చూసిందో కానీ నేను మాత్రం తనకంటే ఎక్కువసార్లు చూసి ఉంటా'’ అని ఈ పాటపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు బన్నీ.
తొందరలోనే సినిమా ఉంటుందా..?
అంతే కాదు "ఒకవేళ నేను సాయి పల్లవితో సినిమా చేయాల్సి వస్తే తనతో డాన్స్ ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఎదురుచూస్తున్నా".. అని తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ మాటలు విన్న సాయి పల్లవి మురిసిపోయింది. అంతకుముందు సాయి పల్లవి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. మరి బన్నీ.. సాయి పల్లవితో సినిమా చేయాలని తన మనసులో మాట ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. సో త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందా..?అన్న ఆసక్తి మొదలైంది.