వచ్చే సంక్రాతి కూడా మాదే అంటాడా?

ఈ సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరూ, రజిని దర్బార్ సినిమాల్తో పెట్టుకుని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తో హిట్ కొట్టాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే [more]

Update: 2020-01-21 05:34 GMT

ఈ సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరూ, రజిని దర్బార్ సినిమాల్తో పెట్టుకుని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తో హిట్ కొట్టాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అల వైకుంఠపురములోతో అందుకున్నాడు. ఈ సినిమా కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ అన్ని కలిపి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కడంతో.. ఈ సినిమాకి ఫ్యామీలీస్ కనెక్ట్ కావడంతో.. కలెక్షన్స్ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ లో దోసుకుపోయి.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్ లో త్రివిక్రమ్ అదరగొట్టేసాడు. అయితే త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడనే టాక్ ఉంది.

ఎన్టీఆర్ తో చక్కటి కామెడీ ఎంటెర్టైనెర్ అంటే జంధ్యాల సినిమాలను గుర్తుచేసేలా ఓ కథని తయారు చేసి తెరకెక్కిస్తాడని, ప్రస్తుతం తన మూస ని పక్కనబెట్టి.. ఎన్టీఆర్ కోసం కొత్తగా సినిమా చేస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ కూడా #RRR షూటింగ్ తో ఈ మే కల్లా ఫ్రీ అయిపోతాడని, ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టి.. చక చకా సినిమా చేసి వచ్చే సంక్రాతి బరిలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి బరిలోకి దిగాలని ప్లాన్ లో ఉన్నట్లుగా టాక్. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి.. నటీనటుల ఎంపిక చేపట్టి…. ఎన్టీఆర్ తో మే కల్లా సినిమాని పట్టాలెక్కించడం ఖాయమంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్

Tags:    

Similar News