దానివెనుకున్న మర్మమేమిటో?

త్రివిక్రమ్ దర్శకుడిగా కన్నా ముందు మాటల మాంత్రికుడు కథా రచయిత. మాటల రచయితా. త్రివిక్రమ్ మాటల మాయాజాలానికి స్టార్ హీరోలకున్న అభిమానులున్నారు. అయన ఏ హీరోతో సినిమ [more]

Update: 2020-08-10 04:34 GMT

త్రివిక్రమ్ దర్శకుడిగా కన్నా ముందు మాటల మాంత్రికుడు కథా రచయిత. మాటల రచయితా. త్రివిక్రమ్ మాటల మాయాజాలానికి స్టార్ హీరోలకున్న అభిమానులున్నారు. అయన ఏ హీరోతో సినిమ తీసిన ఆయన సినిమాలకే ఓ వర్గం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తుంటారు. అయితే మాటల రచయితగా పని చేసిన త్రివిక్రమ్ నువ్వే నివ్వే సినిమాతో దర్శకుడిగా మరి నిన్నమొన్నటి అలా వైకుంఠపురములో సినిమా వరకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగాడు. మధ్యలో అజ్ఞాతవాసి త్రివిక్రమ్ క్రేజ్ తగ్గించినా ఆ అట్టర్ ప్లాప్ మూవీ పవన్ ఖాతలోనే ఎక్కువగా పడింది. అయితే ఎప్పడూ తన సినిమాలకు తానే కథలను సమకూర్చుకునే త్రివిక్రమ్ కి కాపీ డైరెక్టర్ అని పేరున్నపప్టికి… ఆయన దగ్గర ఉన్న కంటెంట్ తో, మేకింగ్ స్కిల్స్ తో ఆ విషయాన్నీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు.

కథ, మాటల విషయంలో అంత దమ్మున్న దర్శకుడు ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో కథలు వినే ప్రోగ్రాం పెట్టుకున్నాడట. తన సర్కిల్స్ లో బాగా తెలిసిన నిర్మాతలను పిలిచి కథలు వింటున్నాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ కథలు వింటున్నది, హారిక హసీనా నిర్మాణ సంస్థ కోసము, అలాగే సితార ఎంటర్టైన్మెంట్ కోసము అంటున్నారు. ఆ నిర్మాణ సంస్థలు త్రివిక్రమ్ కి ఓన్ బ్యానేర్స్ లాంటివి. అందుకే త్రివిక్రమ్ కొత్త కథలు వింటున్నాడని అంటుంటే.. కాదు త్రివిక్రమ్ కొత్త సినిమాల కోసం ఆయన ఈ కథలు వింటున్నాడని.. ఎప్పుడూ కామెడీ కామెడీ అనడమెందుకు.. తన జోనర్ నుండి బాయటికొచ్చి కొత్తతరహా సినిమాల వైపు త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిబడుతుంది. 

Tags:    

Similar News