తెలంగాణ ప్రభుత్వం హీరో ప్రభాస్ కు షాకిచ్చింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గం దగ్గర ఒక గెస్ట్ హౌస్ ఉంది. తాజాగా కోర్ట్ తీర్పుతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని సీజ్ చేసారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయ్యాడు ప్రభాస్. రాయదుర్గం గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టు కేసు నడుస్తోంది. దీనిపై కోర్టు తీర్పు వెలువడి పరిష్కారం లభించడంతో శేరిలింగంపల్లి తహశీల్దారు వాసుచంద్ర ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
సుప్రీం కోర్టు తీర్పు రావడంతో...
అక్కడే ప్రభాస్ గెస్ట్ హౌస్ కూడా ఉండటంతో ఆయన గెస్ట్ హౌస్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది పూర్తిగా వివాదాస్పద స్థలం. ఎప్పటినుండో కోర్టులో ఈ వివాదం నడుస్తోంది. ఇక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో రెవెన్యూ శాఖ సుప్రీం కోర్టుని ఆశ్రశించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఆ స్థలం తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చింది. మరి ప్రభాస్ ఆ స్థలాన్ని వదులుకుంటాడా..? లేదా ఏదైనా ప్రయత్నం చేసి స్థలాన్ని దక్కించుకుని సమస్యను పరిష్కరించుకుంటాడో చూడాలి.