రష్మీ గౌతమ్ ఇంట విషాదం
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. ఆమె గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా మరణించారు.;
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. ఆమె గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా మరణించారు. దీంతో రష్మీ గౌతమ్ ఎమోషనల్ కు గురయ్యారు. బుల్లితెరపై జబర్దస్త, ఎక్స్‌ట్రా జబర్దస్త్ యాంకర్ గా రష్మీ గౌతమ్ అందరికీ సుపరిచితమే. పొరుగు రాష్ట్రమైన అమ్మాయి అయినా తెలుగు యాంకర్ గా ఫేమస్ అయింది.
గ్రాండ్ మదర్ మౄతిపై...
అయితే తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా మరణంతో ఆమె బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన గ్రాండ్ మదర్ తో తనకున్న అనుబంధాన్ని రష్మీ గౌతమ్ గుర్తు చేసుకున్నారు. ఆమె ప్రభావం తనపై ఎంతగానో ఉందని చెప్పారు. ఆమెను కోల్పోవడం తనకు తీరని బాధ మిగిల్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.