వార్నింగ్ ఇచ్చి వదిలారట!!

సత్య దేవ్ రీసెంట్ మూవీ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా ఈమధ్యనే హడావిడి లేకుండా ఓటిటిలో విడుదలై మంచి టాక్ తో మంచి రివ్యూస్ తో నెట్ [more]

Update: 2020-08-22 10:32 GMT

సత్య దేవ్ రీసెంట్ మూవీ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా ఈమధ్యనే హడావిడి లేకుండా ఓటిటిలో విడుదలై మంచి టాక్ తో మంచి రివ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ కి మంచి హైప్ తీసుకొచ్చింది. ఆ సినిమాని గనక ప్రమోట్ చేసినట్లైతే నెట్ ఫ్లిక్స్ కి అదిరిపోయే వ్యూస్ వచ్చేయి. కానీ హడావిడి చెయ్యని ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి మంచి లాభాలనే గడించింది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశాక శాటిలైట్ హక్కులని ఈటివి చేజిక్కించుకుంది. కొత్త సినిమాలను పెద్దగా కొనని ఈటివి వారు లో బడ్జెట్ మూవీ గనక ఉమామహేశ్వర ఉగ్రరూపస్యాని దాదాపుగా 2.5 కోట్లు పెట్టి శాటిలైట్ హక్కులను కొనిందట.

అయితే ఈ సినిమాని త్వరలోనే ఈటివి లో ప్రసారం చేసే లోపు హైద్రాబాదులోని లోకల్ ఛానల్ ఒకటి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యాని తమ ఛానల్ లో ప్రసారం చెయ్యడం ఈ విషయం తెలిసి ఈటివి సీరియస్ అయ్యి.. సదరు కేబుల్ ఛానల్ వాళ్ళకి లీగల్ నోటీసు లు పంపి కోటి నష్ట పరిహారం కోరిందట. దానితో సదరు కేబుల్ ఛానల్ కంగారు పది ఈటివి యాజమాన్యాన్ని శరణు కోరగా శాంతించిన ఈటివి వారు ఆ కేబుల్ ఛానల్ కి వార్నింగ్ ఇచ్చి లీగల్ నోటీసు లను వెనక్కి తీసుకున్నారట.

Tags:    

Similar News