హిందీలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ రికార్డులు

రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఉన్న‌ది ఒకటే జిందగీ` హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `నెం.1 దిల్ వాలా` యూట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ [more]

Update: 2019-02-06 10:19 GMT

రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'ఉన్న‌ది ఒకటే జిందగీ' హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ 'నెం.1 దిల్ వాలా' యూట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కుముందు హిందీలో విడుద‌లైన ఏ తెలుగు సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి హీరో రామ్ పోతినేనికి బాలీవుడ్ జ‌నాల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' స్నేహం విలువ‌ను చెప్పే అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి.. వదులుకున్న అబ్బాయి క‌థ‌. స్నేహితులుగా రామ్‌, శ్రీవిష్ణు న‌టించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియ‌ద‌ర్శి, కిరీటి దామ‌రాజు అల్ల‌రిమాట‌లు న‌వ్వులు పంచాయి. ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై మ‌నీష్ షా విడుద‌ల చేశారు.

Tags:    

Similar News