కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన

"పదిన్నరేళ్ల క్రితం నేను సిద్ధార్థ్ ను కలిశాను. అతను చాలా సైలెంట్ అండ్ స్ట్రాంగ్, అలాగే సున్నితమైనవాడు కూడా.;

Update: 2023-02-08 10:48 GMT
kiara advani, siddharth malhotra, upasana konidela

kiara advani, siddharth malhotra 

  • whatsapp icon

బాలీవుడ్ నటి కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా లు మంగళవారం వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కియారా తమ వివాహ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్టులపై రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని స్పందిస్తూ.. వీలు కుదకపోవడం వల్లే పెళ్లికి హాజరు కాలేకపోయామన్నారు. "కంగ్రాట్స్ కియారా. మీ జోడీ చూడచక్కగా ఉంది. పెళ్లికి మేము హాజరు కాలేకపోయినందుకు సారీ. మరోసారి మీ ఇద్దరికీ నా అభినందనలు." అని కామెంట్ చేశారు.

కియారా అద్వానీ - రామ్ చరణ్ జంటగా వినయ విధేయ రామ లో నటించారు. ఆ సినిమా నుండీ వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RC15 లో మళ్లీ జతకట్టారు. ఈ క్రమంలోనే కియారా రామ్ చరణ్ దంపతులను వివాహానికి ఆహ్వానించింది. షూటింగ్ లో బిజీగా ఉండటంతో చరణ్ దంపతులు ఈ వివాహానికి హాజరుకాలేకపోయారు. కాగా.. నూతన వధూవరులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

"పదిన్నరేళ్ల క్రితం నేను సిద్ధార్థ్ ను కలిశాను. అతను చాలా సైలెంట్ అండ్ స్ట్రాంగ్, అలాగే సున్నితమైనవాడు కూడా. కొన్నేళ్లకు కియారా పరిచయమైంది. సిద్ధార్థ్ లో చూసిన లక్షణాలనే ఈమెలోనూ చూశాను. వీరిద్దరూ కలిసి ఒక అద్భుతమైన ప్రేమకథను సృష్టించగలరని అప్పుడే అనుకున్నాను. అనుకున్నట్లే ఇద్దరూ కలిశారు. స్నేహితులు ప్రేమికులై.. ఈరోజు దంపతులయ్యారు. మీరు ఇలాగే శాశ్వతంగా కలిసుండాలని కోరుకుంటున్నాను" అని బాలీవుడ్ నిర్మాణ కరణ్ జోహర్ ఇన్ స్టాలోని తన వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ పెట్టారు.


Tags:    

Similar News