విజయ్ కొడుకు హీరోగా ఉప్పేనా రీమేక్?

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న ఉప్పెన మూవీ పై ఆ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న విజయ్ సేతుపతి భారీ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. [more]

Update: 2020-04-24 02:45 GMT

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న ఉప్పెన మూవీ పై ఆ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న విజయ్ సేతుపతి భారీ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. మామూలుగానే హీరో తెరంగేట్రం మూవీ అంటే ఏ లో బడ్జెట్ లోనో తెరకెక్కుతుంది. కానీ ఉప్పెన మూవీ కథలో దమ్ము ఉండడంతో.. ఆ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు. మైత్రి వారు ఉప్పెనకు 25 కోట్ల బడ్జెట్ పెట్టడం,.. అందులో విజయ్ సేతుపటికే 7 కోట్ల పారితోషకం ఇవ్వడమే కాదు… ఆ సినిమాని తెలుగు, తమిళంలో విడుదల చేసే ప్లాన్ లో మైత్రి వారు ఉన్నారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఉప్పెన తమిళ డబ్బింగ్ కాకుండా రీమేక్ చేసే యోచనలో ఆ సినిమా తమిళ రీమేక్ హక్కులను కొనేసాడనే టాక్ ఉంది.

అయితే విజయ్ సేతుపతి ఉప్పెన రీమేక్ హక్కులు కొన్నది ఎవరి కోసమో కాదట.. తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు కోసమట, విజయ్ కొడుకు సంజయ్ హీరో అయ్యేందుకు గాను.. ప్రస్తుతం కెనడాలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. విజయ్ కి కొడుకు సంజయ్ ని వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తునందు. అయితే ఉప్పెన కథ  సంజయ్ డెబ్యూ మూవీ కి పర్ఫెక్ట్ గా వుంటుంది అని… విజయ్ తో విజయ్ సేతుపతి చెప్పినట్లుగా న్యూస్ నడుస్తుంది. విజయ్ – విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో హీరో, విలన్స్ గా నటిస్తున్నారు. మాస్టర్స్ సెట్స్ లోనే ఉప్పెన కథ గురించి విజయ్ కి చెప్పి ఒప్పించి.. ఉప్పెన రీమేక్ రైట్స్ ని విజయ్ సేతుపతి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు

Tags:    

Similar News