బుల్లితెర మీద కుమ్మేసిన ఉప్పెన

లాక్ డౌన్ తో సినిమాని తొమ్మిదినెలల పాటు వాయిదా వేసి.. థియేటర్స్ లో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన [more]

Update: 2021-04-30 08:24 GMT

లాక్ డౌన్ తో సినిమాని తొమ్మిదినెలల పాటు వాయిదా వేసి.. థియేటర్స్ లో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఉప్పెన టీం.. ఇప్పుడు బుల్లితెర మీద కూడా సూపర్ హిట్ టీఆర్పీ తెచ్చుకుంది. థియేటర్స్ లో 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని నిర్మాతలకి కట్టబెట్టిన ఉప్పెన మూవీ బుల్లితెర మీద స్టార్ మా కి అదిరిపోయే టీఆర్పీ తెచ్చిపెట్టింది. వైష్ణవ తేజ్ – కృతి శెట్టి ల బ్యూటిఫుల్ పెయిర్, విజయ్ సేతుపతి విలనిజం, దేవిశ్రీ మ్యూజిక్ అన్ని కలిపి ఉప్పెన ని యూత్.. యూత్ఫుల్, మ్యూజికల్ హిట్ గా నిలబెట్టారు.

థియేటర్స్ లో మోత మోగించి ఉప్పొంగిన ఉప్పెన బుల్లితెర మీద స్టార్ మా లో ఏప్రిల్18 ఆదివారం సాయంత్రం ప్రసారం చేసారు. అది కూడా జెమిని ఛానల్ లో విజయ్ – విజయ్ సేతుపతిల మాస్టర్ కి పోటీగా. అయితే విజయ్ మాస్టర్ కి కేవలం 4.5 టీఆర్పీ జెమిని ఛానల్ కి రాగా.. ఉప్పెన ప్రసారం అయిన స్టార్ మా కి 18.5 టీఆర్పీ రావడం నిజంగా షాకింగ్ విషయంగానే చెప్పాలి. థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద కుడా ఉప్పొంగిన ఉప్పెన గా ఉప్పెన సినిమా భారీ టీఆర్పీ తో రికార్డు సృష్టించింది.

Tags:    

Similar News