రిషబ్ పంత్ పై విరుచుకుపడ్డ ఊర్వశి
రిషబ్-ఊర్వశీ మధ్య ఉన్న రిలేషన్ షిప్ కు సంబంధించి ఊహాగానాలకు తెరపడిన చాలా రోజుల తర్వాత;
రిషబ్ పంత్.. ఊర్వశీ రౌతేలా మధ్య వివాదం రోజు రోజుకీ ముదిరిపోతోంది. రిషబ్-ఊర్వశీ మధ్య ఉన్న రిలేషన్ షిప్ కు సంబంధించి ఊహాగానాలకు తెరపడిన చాలా రోజుల తర్వాత ఇటీవల ఇంటర్వ్యూలో ఊర్వశీ మళ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఆర్పీ' తన ఇంటికి వచ్చి లాబీలో గంటలకొద్ది వేచి చూశాడని చెప్పింది. అతడిని కలవాలని అనుకున్నా.. బాగా అలసిపోవడంతో నిద్రపోయానని చెప్పుకొచ్చింది. లేచి చూసే సరికి ఆర్పీ నుంచి 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. ఆర్పీ ఎవరు అని యాంకర్ ప్రశ్నిస్తే.. ఊర్వశీ మాత్రం వివరణ ఇవ్వలేదు. ఆర్పీ అంటే రిషబ్ పంత్ అని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది చివరికి రిషబ్ పంత్ దాకా చేరింది. రిషబ్ పంత్ ఊర్వశీ పేరును ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చాడు. వార్తల్లో నిలవడం కోసం ఇంటర్వ్యూల్లో అబద్ధాలను చెప్పే వాళ్లను చూస్తే నవ్వొస్తోందన్నాడు. పేరు, ప్రఖ్యాతుల కోసం వాళ్లు ఇలా దిగజారడం బాధపడాల్సిన అవసరం అని చెప్పుకొచ్చాడు. 'నా వెంట పడకు అక్కా.. అబద్ధాలకు కూడా హద్దులు ఉంటాయి' "merapichachorhoBehen #Jhutkibhilimithotihai అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రిషబ్ పంత్ తన పోస్ట్ ను డిలీట్ చేశాడు.