వి అయితే ఇచ్చేసాడు.. కానీ వకీల్ సాబ్ ని ఇస్తాడా?

దిల్ రాజు వి సినిమాని ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని కూర్చుని కూర్చుని చివరికి వి సినిమాని మంచి రేటు వచ్చింది కదా అని నాని [more]

Update: 2020-09-09 03:18 GMT

దిల్ రాజు వి సినిమాని ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని కూర్చుని కూర్చుని చివరికి వి సినిమాని మంచి రేటు వచ్చింది కదా అని నాని ను సుధీర్ బాబు ని ఒప్పించి అమెజాన్ ప్రైమ్ వారికీ అమ్మేశాడు. వి సినిమా కంటెంట్ లో కాస్త వీక్ గా వుడనడంతో వి ని అమ్మి దిల్ రాజు ఎలాగో క్యాష్ చేసుకున్నాడని అన్నారు. వి ని థియేటర్స్ కోసం వేచి చూడకుండా ఓటిటికి అమ్మేసి చేతులు దులుపుకోకపోతే థియేటర్స్ లో కలెక్షన్స్ వచ్చేవి కాదని సోషల్ మీడియాలో విపరీతంగా టాక్ వినిపించింది. అయితే తాజాగా వి ని అమెజాన్ కి అమ్మేసిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని అమ్మగలడా ? అంటూ ఓ ప్రశ్న సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ని క్యాష్ చేసుకోవాలనిబాలీవుడ్ రీమేక్ ని పవన్ తో చేయించిన దిల్ రాజు..ఆ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. కరోనా రాకపోతే వకీల్ సాబ్ ఎప్పుడో విడుదలయ్యేది. కానీ కరోనా వలన ఓ 20 రోజుల్ షూటింగ్ పెండింగ్ పడింది. అయితే ఆ 20 రోజుల షూటింగ్ అయ్యాక థియేటర్స్ బంద్ ఇలానే నడిస్తే దిల్ రాజు వకీల్ సాబ్ ని ఓటిటికి అమ్మేస్తాడా అంటున్నారు. మరి వి ని అమ్మేశాడు. అలాగే వకీల్ సాబ్ కూడా అమ్మగలడా? పవన్ క్రేజ్ ఓటిటి కి ఎక్కువ అందుకే.. థియేటర్స్ లో వకీల్ సాబ్ విడుదల చేసి పవన్ క్రేజ్ ని దిల్ రాజు క్యాష్ చేసుకుంటాడు. 

ఒకేవేళ థియేటర్స్ బంద్ ఇంకా నడుస్తున్నా.. వకీల్ సాబ్ కి 50 నుండి 80 కోట్ల ఆఫర్ ఇచ్చినా వకీల్ సాబ్ ని అలానే ఉంచేస్తాడు కానీ ఎట్టిపరిస్థితుల్లో వకీల్ సాబ్ ని దిల్ రాజు ఓటిటికి అమ్మడంటున్నారు. పవన్ సినిమా అంటే వెండితెర మీదే చూడాలి కానీ.. ఓటిటి లో చూడడమేమిటి అంటున్నారు. నిజంగానే దిల్ రాజు ఓటిటి నుండి వకీల్ సాబ్ కి కళ్ళు చెదిరే ఆఫర్ వచ్చినా అమ్మడని అనిపిస్తుంది.

Tags:    

Similar News