పవన్ తో సినిమా అన్నావ్.. ఇప్పుడేమైంది!!

ఒక సినిమా.. ఒకే ఒక్క సినిమా అంటూ పవన్ వెంటపడిన దిల్ రాజుకి ఇప్పుడు పవన్ వలన చుక్కలు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే [more]

Update: 2020-11-19 17:19 GMT

ఒక సినిమా.. ఒకే ఒక్క సినిమా అంటూ పవన్ వెంటపడిన దిల్ రాజుకి ఇప్పుడు పవన్ వలన చుక్కలు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే కల పింక్ రీమేక్ తో తీరబోతుంది అనుకున్నాడు దిల్ రాజు. అందుకే పవన్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన వాడు( వకీల్ సాబ్ షూటింగ్ – ఏపీ రాజకీయాల కోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ ని ఆరెంజ్ చెయ్యడం లాంటివి) ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజ్ డేట్ విషయంలో ఎందుకింత కామ్ అయ్యాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. కానీ పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అనగానే చాలామంది ఓ క్లారిటీకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ అందరికన్నా వెనకాలే వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టాడు. 

మరి మామూలుగానే పవన్ ఎప్పడు షూటింగ్ కి వస్తాడో, ఎప్పుడు రాజకీయాలంటాడో అర్ధం కాదు. ఇప్పుడు అసలే ఎన్నికల హడావిడి, అందులోను టైం ఎక్కువలేదు. మరోపక్క  నాగబాబు కూతురు పెళ్లి ఒకటి. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ జనసేన పోటీ. అందుకే దిల్ రాజు పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చెయ్యనివ్వండి అప్పుడు రిలీజ్ డేట్ విషయం ప్రకటిద్దాం. లేదంటే వకీల్ సాబ్ ఏ సంక్రాంతికో అని ప్రకటించాక పవన్ గ్రేటర్ ఎన్నికలతోను, అన్న కూతురు పెళ్లి విషయంలో షూటింగ్ కి గ్యాప్ తీసుకుంటే అనవసరంగా ఇరుక్కోవాలి. ముందు ఎన్నికలు, నిహారిక పెళ్లి పూర్తయ్యాక.. అప్పుడు వకీల్ సాబ్ డేట్ ఇద్దాంలే అని అనుకుంటున్నాడట.

Tags:    

Similar News