వకీల్ సాబ్ కి ఇలా అయితే కష్టం

బాలీవుడ్ లో అమితాబచ్చన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన పింక్ అనే సినిమా ఫెమినిజం బేస్ చేసుకుని తీసిన సినిమా. ఆడవారి మీద జరిగే అకృత్యాలకు, అరాచకాలకు [more]

Update: 2021-03-09 13:13 GMT

బాలీవుడ్ లో అమితాబచ్చన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన పింక్ అనే సినిమా ఫెమినిజం బేస్ చేసుకుని తీసిన సినిమా. ఆడవారి మీద జరిగే అకృత్యాలకు, అరాచకాలకు సమాధానం చెప్పిన సినిమా. అందుకే ఆ సినిమా బాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది. సౌత్ నుండి బాలీవుడ్ కి అడుగుపెట్టిన తాప్సిని సడన్ గా స్టార్ హీరోయిన్ ని చేసింది. అమితాబచ్చన్ ఎక్సట్రార్డినరీ పెరఫార్మెన్స్ తో పింక్ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పింక్ సినిమాని తమిళ్ లోకి తీసుకువచ్చినా.. స్టార్ హీరో అయిన అజిత్ కూడా ఆ కేరెక్టర్ కి లోబడే పెర్ఫార్మ్ చేసాడు. అందుకే తమిళ్ లో కూడా పింక్ రీమేక్ సక్సెస్ అయ్యింది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హీరోగా పింక్ రీమేక్ టాలీవుడ్ కి వచ్చేసరికి  హీరోయిజం ఎక్కువైపోయింది అనే కంప్లైంట్ ఉంది. అది వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినప్పటినుండి చాలామంది ప్రేక్షకుల మాటగా వినబడుతుంది. గత ఏడాది రిలీజ్ అయిన మగువా మగువా సాంగ్ పక్కనబెడితే.. రీసెంట్ గా విడుదలైన సత్యమేవ జయతే సాంగ్ పవన్ కళ్యాణ్ ఓన్ సాంగ్ గా వుంది, జనసేన పార్టీ సాంగ్ లా ఉంది తప్ప కథలో మెల్ట్ అయిన సాంగ్ లాగా.. కథకి రిలేటెడ్ అయిన సాంగ్ లా లేదు. దీని మీద ఆల్రెడీ కాంట్రవర్సీస్ జరిగాయి. సత్యమేవ జయతే సాంగ్ రాసిన రామజోగయ్య శాస్త్రి కూడా దీని మీద ట్విట్టర్ వేదికగా అపాలజీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక నిన్న ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వకీల్ సాబ్ పోస్టర్ లో కూడా ఉమెన్స్ ఎలివేట్ అవ్వలేదు. మహిళలను సెక్యూర్ చేస్తున్న వకీల్ సాబ్ ఎలివేట్ అయ్యాడు.
మరి మొదటి నుండి అంటే పింక్ రీమేక్ తెలుగులో అనుకున్నప్పటి నుండి వకీల్ సాబ్ ని హీరోయిజమే డామినేట్ చేస్తుంది. అసలు పింక్ కథ అది కాదు. ఇది ఆడియన్స్ ని రాంగ్ గైడెన్స్ లోకి తీసుకెళ్తుంది. 

Tags:    

Similar News