నా కూతురు చెప్పిందని…!

ప్రస్తుతం మహర్షి సినిమా విజయం సాధించడంతో బాగా హుషారుగా ఉన్న వంశీ పైడిపల్లి.. మహర్షి ప్రమోషన్స్ లో తెగ హల్చల్ చేస్తున్నాడు. మహేష్ ఇచ్చే పార్టీలకు, మహేష్ [more]

Update: 2019-05-20 09:53 GMT

ప్రస్తుతం మహర్షి సినిమా విజయం సాధించడంతో బాగా హుషారుగా ఉన్న వంశీ పైడిపల్లి.. మహర్షి ప్రమోషన్స్ లో తెగ హల్చల్ చేస్తున్నాడు. మహేష్ ఇచ్చే పార్టీలకు, మహేష్ తో పాటు పలు కాలేజ్ లకు తిరుగుతున్న వంశీ పైడిపల్లి గతంలో 120 కేజీల బరువు ఉండేవాడట. ఏది చూసినా కంట్రోల్ లేకుండా లాగించేసే సరికి అలా బాగా బరువు పెరిగిపోయాడట. అయితే మహర్హి ప్రమోషన్స్ లో జోరుగా హుషారుగా పాల్గొంటున్న వంశీ పైడిపల్లి తన బరువు విషయమై మాట్లాడాడు. తాను స్వతహాగా భోజన ప్రియుడినని, ఏదైనా బాగా లాగించేసేవాడినని, దీంతో నేను 120 కేజీల బరువు పెరిగిపోయానన్నారు.

మహేష్ కు రుణపడి ఉంటా…

అయితే ఒక రోజు తన కూతురు తన దగ్గరికి వచ్చి నానా నువ్వు చాలా లావైపోతున్నావు అని అనగానే అప్పటి నుండి తాను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నాడు వంశీ పైడిపల్లి. అలా బోలెడన్ని కసరత్తులు చేసిన తరవాత తాను 83 కేజీల బరువు వద్ద ఆగానని చెప్పాడు. ఇక మహర్షి విజయం తనకి సంతోషాన్ని ఇచ్చిందని.. మహేష్ సర్ తనను నమ్మి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ తనకి అప్పగించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నాడు వంశీ.

Tags:    

Similar News