విలన్ కే విలనిజాన్ని పరిచయం చేస్తుందట!!

తెలుగు, తమిళ భాషల్లో లేడి విలన్ అనగానే.. వెంటనే గుర్తుకు వచ్చేది వరలక్ష్మి శరత్ కుమార్. విజయ్ లాంటి బడా స్టార్ హీరోల సినిమాల్లో లేడి విల్లన్ [more]

Update: 2020-04-23 07:16 GMT

తెలుగు, తమిళ భాషల్లో లేడి విలన్ అనగానే.. వెంటనే గుర్తుకు వచ్చేది వరలక్ష్మి శరత్ కుమార్. విజయ్ లాంటి బడా స్టార్ హీరోల సినిమాల్లో లేడి విల్లన్ గా నటించిన వరలక్ష్మి తెలుగులోనూ సందీప్ కిషన్ సినిమా తెనాలి రామకృష్ణ లోను నటించింది. అయితే రవితేజ క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్ చేస్తుంది. అయితే ఏదో సాదా సీదా విలన్ రోల్ అనుకున్న వారికీ ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర షాకిస్తుందట.

అంటే మాములుగా కాదు అంటున్నారు. మెయిన్ విలన్ గా రవితేజని దడ పుట్టిస్తుందట వరలక్ష్మి శరత్ కుమార్. తన భర్తను అంతం చేసిన హీరో (రవితేజ్)పై పగ తీర్చుకునే విలన్ పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. ఆలా విలనిజాన్ని సంబందించిన సన్నివేశాల్లో ఆమె నటన క్రాక్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మరి రవితేజ ని వరలక్ష్మి శరత్ కుమార్ తన విలనిజంలో అల్లాడించడం ఖాయంగా చెబుతున్నారు. 

Tags:    

Similar News