మరో మెగా హీరోకి పాజిటివ్!

మొన్న చిరుకి కరోనా అనుకుని రెండు మూడు రోజు క్వారంటైన్ లో ఉండి.. మళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకోగా చిరుకి నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న మెగా [more]

Update: 2020-12-30 09:27 GMT

మొన్న చిరుకి కరోనా అనుకుని రెండు మూడు రోజు క్వారంటైన్ లో ఉండి.. మళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకోగా చిరుకి నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మరోసారి కరోనాకి దొరికిపోయింది. ఈమధ్యన నిహారిక పెళ్లి వేడుకలు, అలాగే క్రిస్మస్ వేడుకలని కలిసి సెలెబ్రేట్ చేసుకున్న మెగా ఫ్యామిలిలో రామ్ చరణ్ ఈ రోజు ఉదయం కరోనా బారిన పడడంతో ఫ్యామిలీ మొత్తం కరోనా టెస్ట్ లకి పరిగెత్తింది. చాలా తక్కువ లక్షణాలతో కరోనా సోకింది అని రామ్ చరణ్ ట్వీట్ చెయ్యగానే.. అమ్మో మెగా ఫ్యామిలీ అంటూ ఫాన్స్ కంగారు పడినట్లుగానే ఇప్పుడు మెగా ఫ్యామిలిలో ఒక్కొక్కరిగా పాజిటివ్ లతో బయటికి వస్తున్నారు.

వరుణ్ తేజ్ కూడా కరోనా టెస్ట్ చేయించుకోగా.. వరుణ్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఫాన్స్ మరింత షాకవుతున్నారు. ఇక నిహారిక కి మాత్రం నెగెటివ్ రావడం, మిగతా ఫ్యామిలిలో ఎంతమందికి కరోనా వచ్చిందో అంటూ ఫాన్స్ కంగారు పడుతున్నారు. మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ దగ్గరనుండి వైష్ణవ్ తేజ్, శిరీష్, సాయి తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, చిరు అంతా కలిసి పార్టీలు అంటూ హడావిడి చెయ్యడంతో ఇప్పుడు వీరిలో ఎంతమంది కరోనాకి దొరికిపోయారో అనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు మెగా హీరోలంతా తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్న టైం లో కరోనా పోజిటివ్స్ తో అవన్నీ వాయిదా పడడం అనివార్యం. రామ్ చరణ్ RRR దగ్గరనుండి వరుణ్ కొత్త సినిమాలు, సాయి తేజ్, అల్లు అర్జున్ పుష్ప సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా టాక్.

Tags:    

Similar News