వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్.. పుష్ప రికార్డ్ బ్రేక్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వీరసింహారెడ్డి తొలిరోజు రూ.43 లక్షలు వసూలు చేసింది. ఇక్కడ పుష్ప రూ.41 లక్షలు వసూలు చేయగా..;

Update: 2023-01-13 13:07 GMT
veerasimha Reddy firstday collections

veerasimha Reddy firstday collections

  • whatsapp icon

బాలకృష్ణ హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమైన సినిమా వీరసింహారెడ్డి. నిన్ననే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన వీరసింహారెడ్డి.. తొలి షో నుండి.. ప్రతి ప్రాంతంలోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. హైదరాబాద్ లో ఉదయం 4 గంటలకే.. షోలు పడగా.. 54 థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.


హైదరాబాద్ మొత్తం తొలిరోజు 1000 కంటే ఎక్కువ షోలు పడగా.. రికార్డు వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వీరసింహారెడ్డి తొలిరోజు రూ.43 లక్షలు వసూలు చేసింది. ఇక్కడ పుష్ప రూ.41 లక్షలు వసూలు చేయగా.. వీరసింహారెడ్డి పుష్పను వెనక్కు నెట్టింది. రూ.75 లక్షల వసూళ్లతో ఆర్ఆర్ఆర్ మొదటిస్థానంలో ఉండగా.. సర్కారువారి పాట, కేజీఎఫ్ 2 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా.. వీరసింహారెడ్డి తొలిరోజు రూ.54 కోట్ల వసూళ్లు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్ట్ సినిమా అయినప్పటికీ, తన పాత్రకు నిండుదనాన్ని తీసుకొచ్చింది. కథాకథనాలు .. మాటలు .. పాటలు .. డాన్సులు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ ఇలా అన్నీ కలిసి రావడం వల్లే ఈ సినిమా హిట్ కొట్టింది.


Tags:    

Similar News