Chiru - Venky : చిరుతో చేయబోయే మల్టీస్టారర్ కథ చెప్పిన వెంకీ..
చిరంజీవితో అలాంటి సినిమా చేస్తానంటూ ఓ మల్టీస్టారర్ కథ చెప్పిన వెంకీ మామ. ఆ కథ ఏంటంటే..
Chiranjeevi - Venkatesh : టాలీవుడ్ కి నాలుగు పిల్లర్లుగా ఉన్న చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ నాగార్జున.. తమ తమ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూనే వచ్చారు. అయితే చాలామంది ప్రేక్షకులకు ఈ స్టార్స్ ఓ మల్టీస్టారర్ సినిమాతో వస్తే చూడాలని ఆశపడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ ఓ సినిమా చేస్తే చూడాలని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు కామెడీ టైమింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే మాస్ సీన్స్ కూడా అదుర్స్ అనిపిస్తారు.
అలాంటి వీరిద్దరూ ఓ సినిమా చేస్తే అది ఆడియన్స్ కి ఓ ఉత్సవం అనే చెప్పాలి. చిరంజీవి, వెంకటేష్ కూడా కలిసి ఓ సినిమా చేయాలని ఉంది. ఈ విషయం గురించే ఇటీవల ఓ ఈవెంట్ లో మాట్లాడారు. సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న 'సైంధవ్'తో వెంకటేష్ 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. దీంతో రీసెంట్ గా 75 ఫిల్మ్స్ సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వెళ్లారు. ఆ ఈవెంట్ కి సంబంధించిన వీడియోని రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు.
ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. "నేను వెంకటేష్ ఓ సినిమా చేయాలని ఇందాక ఒకరు మాట్లాడారు. అలా ఒక సినిమా చేయడం మా ఇద్దరి కోరిక కూడా. అది విన్న వెంకటేష్ నాకు ఓ సినిమా కథని కూడా వినిపించేశాడు. నన్ను ముందు నిలుచోపెడతాడు అంటా. తాను వెనకాల ఉండి.. నేను ఆర్డర్స్ ఇవ్వగానే వెళ్లి నరుక్కుని వచ్చేస్తాను అంటూ ఓ స్టోరీ లైన్ చెప్పేశాడు. నిజగానే ఒక సినిమా మాకు కుదిరితే తప్పకుండా చేస్తాము. అది త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను" అంటూ వెల్లడించారు.
కాగా సైంధవ్ సినిమా జనవరి 13న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ అండ్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.