ఆ అధికారం ఏ వ్యక్తికి, సంస్థకు లేదు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ సినిమాని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్న సంగతి తెలిసిందే

Update: 2022-07-24 13:10 GMT

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ సినిమాని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమాలో రామ్ చరణ్ పలు గెటప్ లలో సందడి చేయబోతున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల్ని తీసుకుంటున్నారని, టైటిల్ ఇదే అని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్, శంకర్ సినిమా గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని, మా ప్రాజెక్ట్‌లో ఏదైనా పాత్ర కోసం వ్యక్తులను నటించడానికి ఎవర్ని తీసుకోవట్లేదని, మా పేరు చెప్పి అలా చేయడానికి ఏ వ్యక్తికి లేదా ఏజెన్సీకి అధికారం లేదని తెలుపుతూ ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలని, జాగ్రత్తగా ఉండాలని మేము స్పందిస్తున్నాము అని ఓ లేఖని విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తి అవాస్థవమని.. తమ ప్రాజెక్ట్‌లో ఎవరినైనా నటీనటులుగా ఎంపిక చేసే బాధ్యత, అధికారం ఏ వ్యక్తికి, సంస్థకు లేదని ఆ రూమర్లను ఖండించింది.

ఈ సినిమా కూడా లీకుల బెడదను ఎదుర్కొంటూ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి. రామ్ చరణ్ లుక్ మాత్రం రివీల్ అవుతూ వస్తోంది. రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్, లుక్స్ మీద అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.

https://twitter.com/SVC_official/status/1551074057906401280


Tags:    

Similar News