Saindhav: సెన్సార్ పూర్తీ చేసుకున్న వెంకటేష్ 'సైంధవ్'

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్

Update: 2023-12-30 12:40 GMT

Venkatesh Saindhav Movie 

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. విక్టరీ వెంకటేష్- శైలేష్ కొలను కాంబినేషన్ లో వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌ దక్కింది. ఈ చిత్రం జనవరి 13న విడుదలకు సిద్ధంగా ఉంది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75 వ చిత్రంగా సైంధవ్ రావోతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ అందించారు. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా వస్తోంది.

సైంధవ్ సినిమా ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం చెబుతోంది. పాటలలో చూపినట్లుగా తండ్రి - కుమార్తె బంధం సినిమాలో ప్రధాన అంశం. వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా వంటి అనేక మంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమై ఉన్నారు. ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను తీసుకున్నారు. సైంధవ్ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.





 


Tags:    

Similar News