కరోనా ప్రభావం మాకు లేదంటున్న హీరోలు?

అందరూ కరోనా తో సినిమా షూటింగ్స్ వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. టాలీవుడ్ లేదు.. ఏ వుడ్ అయినా హీరోలంతా ఎంచక్కా ఇంట్లోనే పిల్లల్తో కాలక్షేపం చేస్తున్నారు. [more]

Update: 2020-03-19 07:09 GMT

అందరూ కరోనా తో సినిమా షూటింగ్స్ వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. టాలీవుడ్ లేదు.. ఏ వుడ్ అయినా హీరోలంతా ఎంచక్కా ఇంట్లోనే పిల్లల్తో కాలక్షేపం చేస్తున్నారు. బడా మూవీలే కరోనా దెబ్బకి గజగజ వణికాయి. RRR , ప్రభాస్ జాన్, చిరు ఆచార్య, పవన్ వకీల్ సాబ్, అల్లు అర్జున్ – సుక్కు మూవీ ఇలా అన్ని సినిమాలకు బ్రేకులు పడ్డాయి. కరోనా ప్రభావం రోజు రోజుకి ఎక్కువవుతుంటే.. ఇద్దరు హీరోలు మాత్రం మా మీద కరోనా ప్రభావం లేదంటున్నారు. వారే టాలీవుడ్ స్టైలిష్ హీరోలైన విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లు. అదేమిటి పూరి కూడా చెప్పాడు. మా సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చేసి.. ముంబై ఆఫీస్ కి తాళం వేసి హైదరాబాద్ వచ్చేసాం అని. మరి విజయ్ దేవరకొండ సినిమా కరోనా తో ఆగితే.. విజయ్ కరోనా ప్రభావం లేదంటున్నాడు. అలాగే ఈ నెల 13 న మొదలవ్వాల్సి అల్లు అర్జున్ – సుక్కు మూవీ కూడా వాయిదా పడింది. అల్లు అర్జున్ కూడా కరోనా ప్రభావం లేదనడమేమిటి అనుకుంటున్నారట. అవును మిగతా హీరోలంతా కరోనా తో కామ్ అయితే..

విజయ్ దేవరకొండ మాత్రం పూరి సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీని పెంచాడు. ప్రస్తుతం దాని మెయింటినెన్స్ కోసం, బాడీ ని ఫిట్ గ ఉంచడానికి గాను జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడట. అలాగే తన రౌడీ బ్రాండ్ దుస్తులను కూడా మోడల్స్ గా మరింత ప్రచారం చేస్తున్నాడట. ఇంట్లో కూర్చునే సోషల్ మీడియా ద్వారా రౌడీ బ్రాండ్ పబ్లిసిటీ మొదలెట్టాడట విజయ్ దేవరకొండ. మరో పక్క అల్లు అర్జున్ సుకుమార్ సినిమా కోసం ఇప్పటికే హెయిర్ పెంచి, గెడ్డం పెంచి రఫ్ గా తయారయ్యాడు. లుక్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుని సెట్స్ మీదకెళదామనుకునేసరికి…. కరోనా దెబ్బ వేసింది. అందుకే అల్లు అర్జున్ సుక్కు సినిమా కోసం లుక్ టెస్ట్స్ లో పాల్గొంటున్నాడట. తన ఆఫీస్ లో పెద్దగా జనాలు లేకుండా లుక్ టెస్ట్ కోసం రోజు కష్టపడుతున్నాడట. సో.. అందుకే కరోనా ప్రభావం మా మీద లేదంటున్నారు ఈ హీరోలు

Tags:    

Similar News