విజయ్ దేవరకొండ హాస్పిటల్ పాలయ్యాడా..?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తో సినిమాలు చేస్తున్నాడు. ఏకధాటిగా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరోపక్క బ్రాండ్ అంబాసిడర్ గా పలు సంస్థలకు [more]
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తో సినిమాలు చేస్తున్నాడు. ఏకధాటిగా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరోపక్క బ్రాండ్ అంబాసిడర్ గా పలు సంస్థలకు [more]
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తో సినిమాలు చేస్తున్నాడు. ఏకధాటిగా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరోపక్క బ్రాండ్ అంబాసిడర్ గా పలు సంస్థలకు ఉండటంతో పాటు బిజినెస్ పనులతో క్షణం తీరికలేని విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉన్న విజయ్ నిన్న రాత్రి హాస్పిటల్ తో చేరిన వార్త యూత్ ని, విజయ్ అభిమానులను కలవరపెడుతుంది. విజయ్ దేవరకొండ నిన్న జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నాడట. అయితే హోలీ సెలెబ్రేషన్స్ పూర్తయ్యేసరికి విజయ్ దేవరకొండకి కాస్త అలసటగా, జ్వరం వచ్చినట్టుగా అనిపించగా ఒక ప్రవేట్ హాస్పిటల్ కి వెళ్లాడు. అక్కడి డాక్టర్స్ విజయ్ ని అడ్మిట్ కమ్మని చెప్పారట.
జ్వరంతోనే ఆసుపత్రికి
ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉన్న విజయ్ ఆరోగ్యాన్ని ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఇబ్బంది పడాల్సి వస్తుందని.. అందుకే డాక్టర్స్ చెప్పినట్టుగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడట. షూటింగ్స్ కి గ్యాప్ ఇవ్వకుండా ఎండావాన చూడకుండా పని చేయడంతో అలిసిపోయిన విజయ్ కి నార్మల్ ఫీవర్ అని.. రెండు మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక విజయ్ ఫాన్స్ ని కంగారు పడవద్దని.. విజయ్ కి కేవలం చిన్నపాటి జ్వరమే వచ్చిందని విజయ్ ఫ్రెండ్స్ చెబుతున్నారు.