డియర్ కామ్రేడ్ ని బాయ్ కాట్ చేసారు
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ సౌత్ ఇండియాలో నాలుగు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ [more]
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ సౌత్ ఇండియాలో నాలుగు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ [more]
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ సౌత్ ఇండియాలో నాలుగు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయిన ఈసినిమా డివైడ్ టాక్ తో ఓ మోస్తరుగా ఆడుతుంది. ఇక ఈసినిమాను కన్నడ ప్రేక్షకులు బాయ్ కాట్ ట్రెండ్ స్టార్ట్ చేసారు. కారణం ఈసినిమా కన్నడ వెర్షన్ చాలా తక్కువ థియేటర్స్ లో కర్ణాటకలో ఎక్కడెక్కడో కొన్ని షోలు మాత్రమే ఇచ్చారు. కానీ తెలుగు వెర్షన్ మాత్రం భారీ స్థాయిలో రిలీజైంది.
కన్నడ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ భారీ స్థాయిలో రిలీజ్ అవ్వడంతో తెలుగు చిత్రానికి అన్నేసి స్క్రీన్లు కేటాయించడం కన్నడిగులకు నచ్చలేదు. బెంగుళూరు లాంటి ప్రైమ్ సిటీ లో తెలుగు సినిమాకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడంతో కన్నడ సినిమాలకు అక్కడ పరిస్థితి చాలా కష్టంగా ఉంటోంది. అందుకే ఈసినిమాని బాయ్ కాట్ చేయాలనీ చూస్తున్నారు. గతంలో డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ చేయకూడదని వాటిపై నిషేధం విధించారు. కాని ‘కేజీఎఫ్’ వేరే భాషల్లోకి డబ్ అయి అక్కడ వసూళ్ల మోత మోగించిన నేపథ్యంలో కన్నడలో డబ్బింగ్ చిత్రాలపై నిషేధం తీసేశారు. మళ్లీ ఇప్పుడు వేరే భాష సినిమాలకి క్రేజ్ ఎక్కువ అవ్వడంతో ‘స్టాప్ ది తెలుగు ఇంపోజిషన్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేశారు. మరి దీని ప్రవాభం డియర్ కామ్రేడ్ పై ఎంతవరకు పడుతుందో చూడాలి.