డియర్ కామ్రేడ్ షాకింగ్ రన్ టైం

సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ చిత్రం వచ్చే వారం రిలీజ్ కానుంది. దాదాపు ఏడు నెలల గ్యాప్ తరువాత విజయ్ నుండి [more]

Update: 2019-07-20 07:44 GMT

సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ చిత్రం వచ్చే వారం రిలీజ్ కానుంది. దాదాపు ఏడు నెలల గ్యాప్ తరువాత విజయ్ నుండి సినిమా వస్తుంది కాబట్టి దీనిపై అంచనాలు మాములుగా లేవు. పైగా ట్రైలర్ సాంగ్స్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసాయి. ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేస్తున్నారు విజయ్ అండ్ టీం. నిన్ననే ఈసినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది.

ఈమూవీకి యు/ ఎ వచ్చింది. అంటే ఇందులో కొంత బోల్డ్ లేదా వైల్డ్ కంటెంట్ ఉందనే కదా. ఇదేమి పెద్ద విషయం కాదు కానీ కామ్రేడ్ లెన్త్ ఏకంగా 2 గంటల 50 నిమిషాలకు లాక్ చేయడం అందరికి షాక్ కలిగిస్తోంది. ఈమధ్య ఇంత లెంగ్త్ ఉన్న సినిమాలు ఏమి రాలేదు. అయితే కంటెంట్ మీద నమ్మకంతో ఇంత లెంగ్త్ తో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇది ఒక కాలేజీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఇందులో విజయ్ స్టూడెంట్స్ కి లీడర్ గా కనిపించనున్నాడు.

విజయ్ నటించిన అర్జున్ రెడ్డి మూడు గంటలు ఉన్నా విపరీతమైన ఆదరణ దక్కింది. అలానే రంగస్థలం, మహానటి, భరత్ అనే నేను సినిమాలు ఇంచుమించు కామ్రేడ్ లెన్త్ తో ఉండి సక్సెస్ అయినవే. సో కంటెంట్ బాగుంటే లెంగ్త్ విషయం ఎవరు పటించుకోరు అని భావిస్తున్నారు మేకర్స్. చూద్దాం వారి నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో..

Tags:    

Similar News