ఈ సినిమాని రీమేక్ చేసే దమ్ముందా?
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను, కోలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ పెరికిపోయింది. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాని తమిళ, హిందీలోనూ [more]
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను, కోలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ పెరికిపోయింది. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాని తమిళ, హిందీలోనూ [more]
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను, కోలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ పెరికిపోయింది. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాని తమిళ, హిందీలోనూ రీమేక్ చేశారు. బాలీవుడ్ లో అయితే కబీర్ సింగ్ గా రీమేక్ అయ్యి మోత మోగించింది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన, నటించబోయే తెలుగు సినిమాలపై బాలీవుడ్ దర్శకనిర్మాతలు కర్చీఫ్ వెయ్యడానికి రేడి అవుతున్నారు. రెడీ అవుతున్నారు ఏంటి.. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ని బాలీవుడ్ టాప్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ రిమేక్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు కూడా. అయితే కరణ్ జోహార్ ఈ రీమేక్ విషయాన్ని విజయ్ తో కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చూసి మరీ.. డియర్ కామ్రేడ్ విడుదలకముందు ప్రకటించాడు.
అయితే విడుదలయ్యాక డియర్ కామ్రేడ్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ మిక్స్డ్ టాక్ తో డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ కూడా యావరేజ్ గా కనబడుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ పర్వాలేదనిపించినా సోమ, మంగళ వారాల్లో భారీ డ్రాప్ కనబడుతుంది. అలాగే డియర్ కామ్రేడ్ థియేటర్స్ కూడా అక్కడక్కడా ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ ఆశ జనకంగా కనిపించడం లేదు. ఇక కరణ్ జోహార్ హిందీ రీమేక్ అనగానే ఆ సినిమాలో ధఢక్ జంట జాన్వీ అండ్ ఇషాన్ కట్టర్ లు నటిస్తారని తెగ ప్రచారం జరిగింది. కానీ కరణ్ వాళ్లతో రీమేక్ కాదన్నాడు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ చూసాక, టాక్ చూసాక కరణ్ జోహార్ ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేసే ధైర్యం చేస్తాడనిపించడం లేదు. ఇక్కడే నాలుగు భాషల్లో అతంతమాత్రంగా ఉన్న డియర్ కామ్రేడ్ టాక్ అండ్ కలెక్షన్స్ హిందీ లో రీమేక్ చేస్తే మాత్రం వస్తాయా.. ఏమో చూద్దాం కరణ్ రీమేక్ చేస్తాడా? లేదంటే కేవలం డబ్బింగ్ చేసి వదుల్తాడా? అనేది.