“డియర్ కామ్రేడ్” ట్రైలర్ రివ్యూ

విజయ్ దేవరకొండ – దర్శకుడు భరత్ కమ్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “డియర్ కామ్రేడ్”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా యొక్క థియేట్రికల్ [more]

Update: 2019-07-11 07:34 GMT

విజయ్ దేవరకొండ – దర్శకుడు భరత్ కమ్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “డియర్ కామ్రేడ్”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ కొన్ని గంటలు ముందు రిలీజ్ అయింది. ట్రైలర్ మొత్తం చూస్తే ఇదొక ప్రేమ యుద్ధం అని అర్ధం అవుతుంది. ఇందులో విజయ్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించనున్నాడు.

ఇక రష్మిక ఓ స్టేట్ లెవెల్ క్రికెటర్ గా విజయ్ కు పరిచయం అవుతుంది. ఇద్దరి ప్రేమ పుడుతుంది. కానీ విజయ్ కు సోషల్ భావాలు కలిగి ఉండడంతో పెద్దవారితో గొడవలు, పోరాటాలు వీరిమధ్య అడ్డుగా నిలుస్తాయి. దాంతో ఒక స్టేజి లో ఇద్దరు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్లీ విజయ్ కు రష్మిక పై ప్రేమ పుట్టుకొచ్చి కొన్నేళ్ల తరువాత మళ్ళీ ప్రేమ కావాలంటూ ప్రేమించిన అమ్మాయి కొరకు వెళతాడు.

ఇలా ఈమూవీ ప్రేమ, పోరాటాల మధ్య తన లక్ష్యం ఎలా సాధించాడన్నదే కథలా తెలుస్తుంది. ట్రైలర్ లో విజయ్ నటన అయితే అద్భుతంగా ఉంది. రష్మిక కూడా బాగా చేసింది. ఇక వెనకాల వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా కొత్తగా అండ్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా ఈమూవీ రొమాన్స్,కామెడీ,యాక్టన్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ తో కూడిన సినిమా అని అర్ధం అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈమూవీ ఈనెల 26న విడుదల కానుంది. ట్రైలర్ ప్రకారం ఇది పక్క హిట్ బొమ్మలా కనిపిస్తుంది.

Tags:    

Similar News