చరణ్ ని దాటేసిన విజయ్

విజయ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మీద భారీ అంచనాలున్నాయి. భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. [more]

Update: 2019-07-26 06:21 GMT

విజయ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మీద భారీ అంచనాలున్నాయి. భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దెరకొండ – రశ్మికల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా మీద భీభత్సమైన అంచనాలున్నాయి. స్టూడెంట్ యూనియన్ కి లీడర్ గా విజయ్ దేవరకొండ, క్రికెటర్ గా రశ్మికలు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి మెయిన్ హైలెట్ లిప్ లాక్స్. అందుకే యూత్ లో ఈ సినిమాపై క్రేజ్ భారీగా ఏర్పడింది ఇక ఈ రోజు ఇండియాలో విడుదలైన డియర్ కామ్రేడ్ నిన్న గురువారం రాత్రే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడాయి.

అయితే ఈ ఏడాది యుఎస్ ప్రీమియర్స్ లో మహర్షి 5.16 లక్షల డాలర్లు,ఎన్టీఆర్ కథానాయకుడు 4.83 లక్షల డాలర్లు, ఎఫ్2, 2.59 లక్షల డాలర్ల వసూళ్లతో వరస స్థానాల్లో ఉండగా.. తాజాగా రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ ప్రీమియర్ వసూళ్లను ఇప్పుడు విజయ్ డియర్ కామ్రేడ్ దాటేసింది. యుఎస్ ప్రీమియర్స్ ద్వారా డియర్ కామ్రేడ్ 2.5 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ ఫిగర్ చరణ్ వినయ విధేయరామ కన్నా ఎక్కువగా కావడం గమనార్హం. మరి విజయ్ దేవరకొండ క్రేజ్ యుఎస్ లో ఏ లెవల్లో ఉందో ఈ ప్రీమియర్స్ కలెక్షన్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి విజయ్ డియర్ కామ్రేడ్ కి హిట్ టాక్ పడిందా ఇక ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ మిగతా స్టార్ హీరోలకు కూడా చెక్ పెట్టెయ్యడం ఖాయం.

Tags:    

Similar News