అప్పుడే తొందరేం వచ్చింది విజయ్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ రేంజ్ గురించి ప్రేక్షకులు కథలు కథలుగా చెప్పుకునే స్థాయిలో ఉన్నాడు. రెండు మూడు సినిమాలతోనే విపరీతామైన పాపులారిటీని మూటగట్టుకున్న విజయ్ [more]

Update: 2019-02-20 06:09 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ రేంజ్ గురించి ప్రేక్షకులు కథలు కథలుగా చెప్పుకునే స్థాయిలో ఉన్నాడు. రెండు మూడు సినిమాలతోనే విపరీతామైన పాపులారిటీని మూటగట్టుకున్న విజయ్ దేవరకొండ తెలుగుతో పాటు తమిళంలోనూ వేలు పెడుతున్నాడు. ఇక స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ మిగతా హీరోలలో లేని లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్నాడు. అసలు తన ఫేస్ లోనే రకరకాల యాంగిల్స్ లో కామెడిని పండించ గల సత్తా విజయ్ దేవరకొండలోనే ఉంది. గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు విజయ్ నటనతోనే సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక తాజాగా రష్మిక మందన్నతో కలిసి భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు.

తండ్రి పాత్రలో…

అలాగే విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సింగరేణి కార్మిక యూనియన్ లీడర్ గా కనిపించడంతో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఆ ఇంట్రెస్టింగ్ రోల్ ఏమిటంటే… ఎనిమిది సంవత్సరాల అబ్బాయికి తండ్రిగా విజయ్ కనిపించనున్నాడట. లవ్, ఎమోషనల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్ విజయ్ సరసన నటిస్తున్నారు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్, ఇజబెల్లి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రి పాత్ర చేయడంపై చాలామంది షాకవుతున్నారు. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్లే తండ్రి పాత్రల్లో చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలాంటిది కెరీర్ ఆరంభంలోనే విజయ్ ఇలాంటి తండ్రి క్యారెక్టర్స్ చెయ్యడం అవసరమా… అప్పుడే అంత తొందరేం వచ్చింది విజయ్ అంటున్నారట.

Tags:    

Similar News