పర్ఫెక్ట్ ప్లాన్స్ లేకనే ఇలా?

నాని మొదట్లో మాస్ కథల వెంట పడి చేతులు కాల్చుకున్నప్పటికీ… తర్వాతర్వాత కథల ఎంపికలో.. సినిమాల ప్లానింగ్ లో వైవిద్యం చూపించడంతో.. ఒక్కసారిగా సక్సెస్ బాట పట్టాడు. [more]

Update: 2020-03-20 05:50 GMT

నాని మొదట్లో మాస్ కథల వెంట పడి చేతులు కాల్చుకున్నప్పటికీ… తర్వాతర్వాత కథల ఎంపికలో.. సినిమాల ప్లానింగ్ లో వైవిద్యం చూపించడంతో.. ఒక్కసారిగా సక్సెస్ బాట పట్టాడు. అందులో ఒకటి అరా ప్లాప్ లొచ్చినా.. నాని అస్సలు అదరడు బెదరడు. సినిమాల ఎంపిక ప్లానింగ్ నాని ని విజయ తీరానికి చేర్చింది. అందులోనూ నాని స్టార్ హీరో అవ్వాలనే కళలు కన్నప్పటికీ… ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించింది లేదు. చాలా నార్మల్ గా, చాలా కూల్ గా తన పని చేసుకుంటాడు. అలాగే వివాదాల జోలికి వెళ్ళడు. అందుకే సినిమా బ్యాగ్రౌండ్ నుండి రాకపోయినా… నాని మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ వన్.

కానీ విజయ్ దేవరకొండ అలా కాదు.. రావడం రావడం హిట్ తగిలేసరికి విజయ్ కి కాస్త పొగరు, గర్వం తలకెక్కింది. రెండు హిట్స్ పడేసరికి మనకన్నా తోపు ఎవరూ లేరనుకున్నాడు. తన మీద తనకి అతి నమ్మకం, అలాగే సినిమాల ఎంపికలో విజయ్ దేవరకొండ ఒక్కోసారి ఆలోచనల లేకుండా చేయడంతోనే ద్వారకా, నోటా, వరల్డ్ ఫెమస్ లవర్ లాంటి భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు. నాకు ఫేమ్ ఉంది.. ఆ క్రేజ్ తోనే సినిమా ఆడేస్తుంది అనుకుని.. చాలాపొరబాట్లే చేసాడు. ప్రస్తుతం కూడా పాన్ ఇండియా స్క్రిప్ట్స్ అయితేనే తన వద్దకి రమ్మని దర్శకనిర్మాతల ని బెదరగొడుతున్నాడట. కాస్త దుందుడుకు స్వభావం ఉన్న విజయ్ దేవరకొండ కళ్ళన్ని స్టార్ స్టేట్స్ మీదే. అందుకే విజయ్ కి చాలా ఎదురు దెబ్బలే. ప్రస్తుతం నార్మల్ స్క్రిప్ట్ అంటే తెలుగు ఆడియన్స్ కి సరిపోయే స్క్రిప్ట్ ని పూరి చేత పాన్ ఇండియా ఫిలిం గా చేయిస్తూన్నాడు. ముందే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో స్క్రిప్ట్ ని రెడీ చేయించి పాన్ ఇండియాకి దిగితే అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ సినిమా ఏంటనేది… బాలీవుడ్ కరణ్ జోహార్ కి అర్ధమయింది కానీ.. మిగతా వాళ్ళకి మాత్రం అంతగా అర్ధమే కావడం లేదు.

Tags:    

Similar News