బాలీవుడ్ లోనూ హిట్ కొట్టేద్దామనే

ప్రస్తుతం కుర్రకారు మొత్తం విజయ్ దేవరకొండ మ్యానియా లోనే ఉన్నారు. అసలు యూత్ లో ఏ హీరోకి లేని క్రేజ్ విజయ్ దేవరకొండకి ఉంది. అర్జున్‌రెడ్డి, గీత [more]

Update: 2019-01-06 07:35 GMT

ప్రస్తుతం కుర్రకారు మొత్తం విజయ్ దేవరకొండ మ్యానియా లోనే ఉన్నారు. అసలు యూత్ లో ఏ హీరోకి లేని క్రేజ్ విజయ్ దేవరకొండకి ఉంది. అర్జున్‌రెడ్డి, గీత గోవిందం వరసగా సూపర్ హిట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి తో అందనంత ఎత్తుకు ఈదిన విజయ్ దేవరకొండ గీత గోవిందం తో మరిన్ని మెట్లెక్కాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం సుమారు 100కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడీ చిత్రం హిందీ లోకి కూడా రీమేక్ కాబోతుంది. అయితే విజయ్ దేవరకొండ ప్లేస్ లో ధఢక్ హీరో ఇషాన్ కట్టర్ నటిస్తాడని ప్రచారం ఉంది.

ఇక హీరో ఇషాన్ ఖట్టర్ అని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం గీత గోవిందం హిందీ వెర్షన్ ని కూడా తెలుగు నిర్మాతలైన అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పిస్తారని తెలుస్తుంది. రీమేక్ రైట్స్ రేటు క్రింద గీత ఆర్ట్స్ వారు వాటా పెట్టుకున్నారని తెలుస్తోంది. కానీ ఈ విషయమై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గీత గోవిందం హిందీలోనూ బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి గీతా ఆర్ట్స్ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతోందని తెలుస్తోంది. మరి ఇక్కడ కోట్లు కొల్లగొట్టిన గీత గోవిందం అక్కడ హిట్ కొట్టి నిర్మాతల పంట పండడం ఖాయమనే మాట వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి ఇంకా డైరెక్టర్ ఫిక్స్ కాలేదంటున్నారు.

Tags:    

Similar News