విజయ్ దేవరకొండ బయ్యర్లు ఘొల్లుమంటున్నారు

విజయ్ దేవరకొండ హీరోగా సినిమా వస్తే… దానికి యావరేజ్ టాక్ వచ్చినా ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. ప్లాప్ టాక్ వచ్చినా.. మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. [more]

Update: 2019-11-04 11:02 GMT

విజయ్ దేవరకొండ హీరోగా సినిమా వస్తే… దానికి యావరేజ్ టాక్ వచ్చినా ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. ప్లాప్ టాక్ వచ్చినా.. మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. కానీ నిర్మాతగా మారి సినిమా తీసి దాన్ని తనకున్న క్రేజ్ తో అమ్మేసి చేతులు దులుపుకోకుండా…. ఆ సినిమాని బాగా ప్రమోట్ చేసినా.. సినిమాకి ప్లాప్ టాక్ పడితే.. దాన్ని ఆడించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సినిమాలో విజయ్ హీరో కాదు, కేవలం నిర్మాత మాత్రమే గనక. తాజాగా విజయ్ దేవరకొండ నిర్మాతగా వచ్చిన మీకు మాత్రమే చెప్తా సినిమాకి ప్లాప్ టాక్ పడింది. కామెడీ బావున్నప్పటికీ.. సినిమాలో ఉన్న నెగెటివ్ పాయింట్స్ తో సినిమాకి ప్లాప్ టాక్ పడింది. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కూడా సినిమాని నిలిబెట్టలేకపోయాయి.

ఫస్ట్ డే కాస్త పర్వాలేదనిపించిన మీకు మాత్రమే చెప్తా సినిమా ఫస్ట్ వీకెండ్ లో కాస్త పుంజుకుంటుంది అనుకుంటే… అదేం లేదు… వీకెండ్ లో మీకు మాత్రమే చెప్తా థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాల్సింది పోయి బోసిపోయాయి. మరి వీకెండ్ లోనే సత్తా చాటని సినిమా వీక్ డేస్ లో మరింత వీక్ అవడం ఖాయం. అయితే తక్కువ మొత్తానికే థియేట్రికల్ రైట్స్ అమ్మినప్పటికీ… ఇప్పుడు బయ్యర్లు బాగా నష్టపోయేలా కనబడుతున్నారు. 40 లక్షలకు కొంటే ఇప్పటికి 10 లక్షలు కూడా రాని బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారని టాక్. కొన్ని ఏరియాస్ లో బయ్యర్లకు మినిమమ్ ఖర్చులు కూడా రావని అంటున్నారు.

Tags:    

Similar News