విజయ్ దేవరకొండ రూట్ మార్చాడండోయ్

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ ఉంటది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయినా డియర్ కామ్రేడ్ తో ఆ నమ్మకం పోయింది. [more]

Update: 2019-08-11 06:56 GMT

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ ఉంటది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయినా డియర్ కామ్రేడ్ తో ఆ నమ్మకం పోయింది. ఎందుకంటె డియర్ కామ్రేడ్ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. దాంతో ఈసినిమా ఫ్లాప్‌ గా మిగిలిపోయింది. అలానే ఈమూవీకి ముందు వచ్చిన నోటా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ రెండు సినిమాలు అతని ని తీవ్ర ప్రభావితం చేసాయి. దింతో మనోడు ఇప్పుడు తన ప్లానింగ్‌ మార్చుకుంటున్నాడు.

ఒక తరహాలో సినిమాలు చేయకూడదని విజయ్ ఆలోచిస్తున్నాడు. అందుకే పూరి తో ఓ మాస్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వస్తుంది. ఆమధ్య విజయ్ ని కొంతమంది టాప్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి కాంటాక్ట్‌ చేశారట. అప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ఇప్పుడు తన మార్కెట్ ఎక్కడ పడిపోతుందో అని బయపడి వారిని లైన్ లో పెట్టె పనిలో ఉన్నాడట విజయ్.

ప్రస్తుతం అతను క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే స్టేజి లో ఉంది. దీని తరువాత ఏమిటి అని మాత్రం క్లారిటీ లేదు. అందరు అనుకుంటున్న ప్రకారం అయితే పూరి తో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News